Share News

ఇవిగో ఆధారాలు.. కాకాణీ రాజీనామా చేస్తావా!?

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:08 AM

కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ ఈ నెలాఖరులో మూత పడుతుందని, దీనికి తగిన ఆధారాలున్నాయని మాజీ మంత్రి,

ఇవిగో ఆధారాలు.. కాకాణీ రాజీనామా చేస్తావా!?

కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ ఈ నెలాఖరులో మూత: సోమిరెడ్డి

నెల్లూరు (వైద్యం), జనవరి 27: కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ ఈ నెలాఖరులో మూత పడుతుందని, దీనికి తగిన ఆధారాలున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనవరి 31నుంచి పోర్టులో కార్యకలాపాలు ఆగిపోతున్నాయన్నారు. ఇక నుంచి ఎగుమతులు, దిగుమతులు తమిళనాడు ఎన్నూరు కాటుపల్లి పోర్టుల నుంచి జరుపుకోవాలని ఆదానీ కార్యాలయం నుంచి కంపెనీకి ఈ మెయిల్‌ పంపారని.. ఇవిగో ఆధారాలు అంటూ వాటిని చూపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం టెర్మినల్‌ను తరలిస్తే పదవిలో కొనసాగే ప్రసక్తే లేదన్న కాకాణి ఇప్పుడు రాజీనామా చేస్తారా... లేదంటే సీఎం కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేస్తారా అని ప్రశ్నించారు.

Updated Date - Jan 28 , 2024 | 08:47 AM