Share News

ఇక నుంచి ఏపీ రీ సర్వే ప్రాజెక్టు

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:45 AM

భూముల సర్వే ప్రాజెక్టుకు జగన్‌ పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌ రీ సర్వే ప్రాజెక్టుగా పేరు మారుస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు ఇచ్చారు.

ఇక నుంచి ఏపీ రీ సర్వే ప్రాజెక్టు

భూముల సర్వే పథకానికి జగన్‌ పేరు తొలగింపు

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): భూముల సర్వే ప్రాజెక్టుకు జగన్‌ పేరును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌ రీ సర్వే ప్రాజెక్టుగా పేరు మారుస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు ఇచ్చారు. జగన్‌ పాలనలో భూముల సర్వేను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి వైఎ్‌సఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, మరియు భూ రక్ష పథకం అని పేరుపెట్టారు. సరిహద్దు రాళ్లపైనా జగన్‌ పేరు రాశారు. రైతులకు ఇచ్చిన పాసుపుస్తకాల్లోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ జగన్‌ ఫొటోలు, నవరత్నాల లోగోలు భారీగా ముద్రించారు. ఈ పరిణామంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము అధికారంలోకి వస్తే జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుంటామని ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూముల సర్వేను నిలిపివేశారు.

Updated Date - Sep 18 , 2024 | 06:37 AM