వరద బాధితులకు అందిన సాయం
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:06 AM
వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు,

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో మంత్రుల పర్యటన
బాధితులకు నగదు, సరుకులు అందజేసిన అచ్చెన్న తదితరులు
కుక్కునూరు, జూలై 27: వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పార్థసారథి భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్‌లతో కలిసి మంత్రులు పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. అన్ని సౌకర్యాలూ అందుతున్నాయా? అని ప్రశ్నించారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, పునరావాస పరిహారం చెల్లించి పునరావాస కాలనీలకు తరలించడానికి ప్రభుత్వం ప్రణాళిక చేసిందన్నారు. బాధిత ప్రతి కుటుంబానికి రూ.మూడు వేలు, బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు.