Share News

వైసీపీ నాయకుల వేధింపులు.. టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం Harassment of YCP leaders

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:20 AM

వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త తన పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని పోతలపాడు పంచాయతీలోని కందల్లపల్లెలో చోటుచేసుకుంది. పోతలపాడు గ్రామ సర్పంచ్‌ గాయం శ్రీనివాసులరెడ్డి అన్న

వైసీపీ నాయకుల వేధింపులు.. టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం Harassment of YCP leaders

తర్లుపాడు, మార్చి 13: వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక టీడీపీ కార్యకర్త తన పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని పోతలపాడు పంచాయతీలోని కందల్లపల్లెలో చోటుచేసుకుంది. పోతలపాడు గ్రామ సర్పంచ్‌ గాయం శ్రీనివాసులరెడ్డి అన్న వెంకటేశ్వరరెడ్డి అలియాస్‌ బొర్రయ్య.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కోవలోనే.. అదే పంచాయతీలోని కందల్లపల్లెకు చెందిన బ్రహ్మతేజకుమార్‌ను పలుమార్లు ఇబ్బందులకు గురిచేశాడు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్రహ్మతేజకుమార్‌ వెలుగు ఆఫీ్‌సలో వీవోఏగా పనిచేస్తుండగా, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అతడిని తొలగించి, అతడికి రావాల్సిన 14నెలల జీతం కూడా ఇవ్వనివ్వలేదు. అతడి భూమిని ఆన్‌లైన్‌లో నుంచి తీయిం చి, కుటుంబానికి ఎలాంటి సంక్షేమ పథకాలూ అందకుండా అడ్డుకున్నారు. ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో బ్రహ్మతేజ బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశా రు. కుటుంబ సభ్యులు అతడిని 108లో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న బాధితుడు మాట్లాడుతూ బొర్రయ్య అనేకమార్లు బెదిరించి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. మంగళవారం తన భార్యకు ఫోన్‌ చేసి దుర్భాషలాడినట్లు వాపోయారు. వేధింపులు భరించలేక పురుగుమందు తాగినట్లు బ్రహ్మతేజకుమార్‌ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేముల సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Mar 14 , 2024 | 04:20 AM