Share News

సమిష్టి కృషితోనే గురువైభోత్సవాలు విజయవంతం

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:00 AM

ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు రాఘవేంద్రస్వామి గురు వైభోత్సవాలు శ్రీమఠం అధికారులు, అనధికారులు, గ్రామస్థులు, భక్తుల సహకారంతోనే విజయవంతమయ్యాయనీ మఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు అన్నారు.

సమిష్టి కృషితోనే  గురువైభోత్సవాలు విజయవంతం

మంత్రాలయం, మార్చి 17: ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు రాఘవేంద్రస్వామి గురు వైభోత్సవాలు శ్రీమఠం అధికారులు, అనధికారులు, గ్రామస్థులు, భక్తుల సహకారంతోనే విజయవంతమయ్యాయనీ మఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాల్లో ముఖ్యమైన రోజులు 12 వతేదీన 403వ స్వామివారి పట్టాభిషేకం, 16న రాఘవేంద్రస్వామి 429 పుట్టిన రోజు వేడుకలు మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండువగా జరిగాయనీ తెలిపారు. ప్రముఖులకు గురు వైభోత్సవ-2024 అవార్డులు, భరతనాట్యం, దాసవానిసాహిత్యం, పౌరాణిక నాటకాలు భక్తులను ఆకట్టుకున్నాయనీ తెలిపారు. శ్రీమఠంలోని అన్ని సెక్షన్ల అధికారులు, సిబ్బంది, పోలీసు, మీడియా, గ్రామ రెవెన్యూ అధికారులు సమిష్టి కృషితోనే విజయవంతమయ్యాయనీ పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆశిస్సులు అందించారని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందు రోజుల్లో కూడా జరిగే కార్యక్రమాలను సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి రాఘవేంద్రస్వామి కృపాకటాక్షం ఉంటుందన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:00 AM