గ్రూప్-2 మెయిన్స్ ఫిబ్రవరి 23కు వాయిదా
ABN , Publish Date - Nov 13 , 2024 | 05:17 AM
అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది.

అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 5న మెయిన్స్ పరీక్ష జరగాలి. అయితే, మెయిన్స్ పరీక్షపై నెలకొన్న అనిశ్చితి కారణంగా పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, అలాగే ఇతర పోటీ పరీక్షలూ ఉన్నాయని, మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరారు. వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించనున్నట్లు మంగళవారం తెలిపింది.