Share News

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:03 AM

పట్టణం శివారు ప్రాంతంలోని రణమండల కొండలోని ఆంజనేయస్వామి దేవాలయం, అంబేడ్కర్‌నగర్‌ ఆభయ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
మంత్రాలయంలో ఆంజనేయస్వామిని పల్లకీలో ఊరేగిస్తున్న భక్తులు

జిల్లా వ్యాప్తంగా హనుమాన్‌ జయంతి ఉత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

ఆదోనిలో 101 కళశాలతో రథోత్సవం

ఆదోని (అగ్రికల్చర్‌), జూన్‌ 1: పట్టణం శివారు ప్రాంతంలోని రణమండల కొండలోని ఆంజనేయస్వామి దేవాలయం, అంబేడ్కర్‌నగర్‌ ఆభయ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, కూటమి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారధి, గుడిసె కృష్ణమ్మ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అంబేడ్కర్‌నగర్‌లోని ఆభయ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రథోత్సవాన్ని పురవీధులలో వైభవంగా చేపట్టారు. 101 మంది మహిళలు కళశాల చేత పట్టుకొని స్వామి వారిని ఊరేగించారు.

తుగ్గలి : మండలంలో మండలంలోని జొన్నగిరి, తుగ్గలి తదితర గ్రామాల్లో హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పగిడిరాయిలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, మహామంగళహారతులు ఇచ్చారు. సాయంత్రం అశేష జనవాహిని మద్య రథోత్సవం నిర్వహించారు.

మద్దికెర : మండలంలోని హంపా, పెరవలి, ఎం.అగ్రహారం, మద్దికెర గ్రామాల్లో హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఆయా దేవాలయాల్లో స్వామికి ప్రత్యేక పూజలతో పాటు హంపా గ్రామంలో రథోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - Jun 02 , 2024 | 12:03 AM