Share News

వైసీపీ నేతల ఇళ్లలో సర్కారు మద్యం

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:27 AM

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో బుధవారం భారీ ఎత్తున మద్యం నిల్వలను ఒంగోలు ఎస్‌ఈబీ అధికారులు పట్టుకొన్నారు. ముందస్తు సమాచారం మేరకు.. పెదఉల్లగల్లు

వైసీపీ నేతల ఇళ్లలో సర్కారు మద్యం

దాడులు చేసి భారీగా పట్టుకున్న సెబ్‌.. ప్రకాశంలో వెలుగులోకి బాగోతం

ముండ్లమూరు, ఏప్రిల్‌ 17: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో బుధవారం భారీ ఎత్తున మద్యం నిల్వలను ఒంగోలు ఎస్‌ఈబీ అధికారులు పట్టుకొన్నారు. ముందస్తు సమాచారం మేరకు.. పెదఉల్లగల్లు పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్‌, ముండ్లమూరు, నాయుడుపాలెం గ్రామాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. లక్ష్మీనగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు బీరంరెడ్డి మాలకొండారెడ్డి ఇంట్లో 39 కేసులు, అతని తండ్రి లక్ష్మీరెడ్డి ఇంట్లో 189 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నారు. మొదట ముండ్లమూరులోని ప్రభుత్వ దుకాణం వద్ద 20 కేసులు కారులో వేసుకొని తరలించేందుకు సిద్ధంగా ఉండగా ఎస్‌ఈబీ అధికారులు దాడిచేశారు. డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో లక్ష్మీనగర్‌లో తనిఖీలు చేయగా భారీఎత్తున మద్యం పట్టుబడింది. పట్టుకున్న మద్యం కేసులు ఉల్లగల్లు, ముండ్లమూరు ప్రభుత్వ దుకాణాల నుంచి తరలించినట్టు సమాచారం. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాదరెడ్డి నామినేషన్‌ కార్యక్రమం గురువారం ఉండగా, బుధవారం రాత్రి నుంచే ఆయా గ్రామాలకు తరలించేందుకు మద్యం నిల్వ ఉంచినట్టు సమాచారం. ’

Updated Date - Apr 18 , 2024 | 03:27 AM