Share News

వైభవంగా సత్యనారాయణ స్వామి కల్యాణం

ABN , Publish Date - May 20 , 2024 | 12:00 AM

మండలంలోని చిప్పిలి గ్రామంలో చిట్టిఅన్నవరంలో సత్య నారాయణ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారా యణ స్వామివార్ల కల్యాణం అత్యంత వైభ వంగా నిర్వహించారు.

వైభవంగా సత్యనారాయణ స్వామి కల్యాణం
సత్యనారాయణ స్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మదనపల్లె అర్బన, మే 19: మండలంలోని చిప్పిలి గ్రామంలో చిట్టిఅన్నవరంలో సత్య నారాయణ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారా యణ స్వామివార్ల కల్యాణం అత్యంత వైభ వంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, విశేషపూజ లు చేశారు. అనంతరం ఆలయంలో సత్య నారాయణ, రమాదేవిల కల్యాణం కన్నుల విందుగా వైభవంగా జరిపించారు. ముందుగా ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యే కంగా పూజలు నిర్వహించి అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివార్ల కల్యా ణోత్సవంలో పాల్గొని కన్నులారా తిలకించారు. మధ్యాహ్నం ఆలయంలో భక్తులకు అన్న దానం నిర్వహించారు. సాయంత్రం చిప్పిలి గ్రామంలో సత్యనారాయణ, రమాదేవిల గ్రామోత్సవం నిర్వహించగా ప్రజలు స్వామివార్లకు కర్పూర హారతులు పట్టారు. కార్యక్ర మంలో ఆలయకమిటీ సభ్యులు కె.అమరనాథ్‌, వేదంరామకృష్ణ, శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:00 AM