Share News

మొండితోక బ్రదర్స్‌ కేసు వివరాలు ఇవ్వండి

ABN , Publish Date - Nov 28 , 2024 | 06:12 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉండగా కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసి

మొండితోక బ్రదర్స్‌ కేసు వివరాలు ఇవ్వండి

పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉండగా కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసి ఆయనను అంతమొందించేందుకు కుట్రపన్నారనే ఆరోపణలతో మొండితోక అరుణ్‌కుమార్‌, జగన్‌మోహనరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావుపై నమోదైన కేసులకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Nov 28 , 2024 | 06:12 AM