Share News

పార్టీలు, అభ్యర్థుల ఖాతాల వివరాలివ్వండి

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:14 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఆదాయపన్నుశాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా బ్యాంకర్లను ఆదేశించారు.

పార్టీలు, అభ్యర్థుల ఖాతాల వివరాలివ్వండి

బ్యాంకర్లకు ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశం

అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఆదాయపన్నుశాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గతేడాది అక్టోబరు 1 నుంచి రోజుకి రూ.10 లక్షలకు మించి 30 రోజుల వ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలని అన్ని బ్యాంకుల నోడల్‌ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలాకా్ట్రనిక్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌ అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, శాసనసభ అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. అయితే అంతకు మించి జరిగే వ్యయంపై పటిష్ట నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుంచి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటీశాఖతోపాటు తమకు అందజేయాలన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తదుపరి అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్ష రూపాయాలకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో సీజ్‌ చేసిన నగదు, ఇతర వస్తువుల వివరాలు రియల్‌ టైమ్‌ బేసి్‌సలో నివేదించేందుకు ఎలకా్ట్రనిక్‌ సీజర్‌ మేనేజ్మెంట్‌ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటీ, సీఎ్‌సటీ, పోలీస్‌, ఎక్సైజ్‌ తదితర 22 ఎన్ఫోర్‌మెంట్‌ ఏజన్సీలు నిరంతరం పని చేస్తున్నాయని, వారు సీజ్‌ చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఫీడ్‌ చేస్తారని తెలిపారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు ఈ యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలని ఆయన కోరారు.

Updated Date - Mar 16 , 2024 | 08:37 AM