Share News

రైతుల ఖాతాల్లో నిధులు వెంటనే జమ చేయాలి

ABN , Publish Date - May 16 , 2024 | 03:42 AM

గత ఖరీఫ్‌ సీజన్‌లో కరవు, తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద చెల్లించాల్సిన రూ.1,294 కోట్ల నిధులను తక్షణమే

రైతుల ఖాతాల్లో నిధులు వెంటనే జమ చేయాలి

సీఎస్‌కు రాష్ట్ర రైతు సంఘం లేఖ

అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): గత ఖరీఫ్‌ సీజన్‌లో కరవు, తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద చెల్లించాల్సిన రూ.1,294 కోట్ల నిధులను తక్షణమే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. ఈ నిధుల విడుదలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత మార్చి 6వ తేదీనే బటన్‌ నొక్కారని, కానీ ఇంతవరకు చెల్లింపులు జరగలేదని తెలిపారు.

Updated Date - May 16 , 2024 | 07:40 AM