Share News

సుసంపన్న ఆర్థిక వ్యవస్థకు ‘ఇంధన సామర్థ్యం’!

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:24 AM

సుసంపన్న ఆర్థిక వ్యవస్థకు ఇంధన సామర్థ్య కార్యక్రమం దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

సుసంపన్న ఆర్థిక వ్యవస్థకు ‘ఇంధన సామర్థ్యం’!

ఇంధన పొదుపు విధానాలు అమలు చేస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): సుసంపన్న ఆర్థిక వ్యవస్థకు ఇంధన సామర్థ్య కార్యక్రమం దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంధన పొదుపు సామర్థ్య విధానాలను కొనసాగిస్తామని, హరిత ఇంధనోత్పత్తిని పెంచుతూ వాతావరణ పరిరక్షణ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మిషన్‌ లైఫ్‌ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) దక్షిణాది రాష్ట్రాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి రూపొందించిన పోస్టర్‌ను ఆదివారం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేంద్రం సహకారంతో బీఈఈ అమలు చేస్తున్న సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇంధన సామర్థాఽ్యల పెంపులో రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేస్తూ కేంద్రం కొనసాగిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని వెల్లడించారు.

Updated Date - Jul 15 , 2024 | 04:24 AM