Share News

నేటి నుంచి చంద్రబాబు మలి విడత పర్యటన

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:39 AM

తెలుగుదేశం పార్టీ అధినేత ప్రజా గళం మలి విడత పర్యటన బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఐదు రోజులపాటు ఈ పర్యటన జరగనుంది.

నేటి నుంచి చంద్రబాబు మలి విడత పర్యటన

మొదటి రోజు కోనసీమ జిల్లా కొత్తపేట, రామచంద్రపురం

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత ప్రజా గళం మలి విడత పర్యటన బుధవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఐదు రోజులపాటు ఈ పర్యటన జరగనుంది. ఖరారైన షెడ్యూల్‌ ప్రకారం తొలి రోజు ఈ నెల 3న కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రామచంద్రాపురంలో ఆయన పర్యటన ఉంటుంది. నాలుగో తేదీన కొవ్వూరు, గోపాలపురం, ఐదో తేదీన నర్సాపురం, పాలకొల్లు, ఆరో తేదీన పెదకూరపాడు, సత్తెనపల్లి, ఏదో తేదీన పామర్రు, పెనమలూరుల్లో ఆయన సభలు ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలకు మొదటి మీటింగ్‌, ఆరు గంటలకు రెండో మీటింగ్‌ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

Updated Date - Apr 03 , 2024 | 07:16 AM