చరిత్ర పుటల్లోకి స్వచ్ఛోద్యమం
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:08 AM
భారతదేశ సాంఘిక ఉద్యమాల చరిత్రలో స్వచ్ఛ చల్లపల్లి మకుటాయమానంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
చల్లపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యో తి): భారతదేశ సాంఘిక ఉద్యమాల చరిత్రలో స్వచ్ఛ చల్లపల్లి మకుటాయమానంగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. 2014లో స్వచ్ఛభారత్ ప్రారంభమైన తరుణంలో అవనిగడ్డ నియోజకవర్గాన్ని స్వచ్ఛ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో చల్లపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు కారణమైందన్నారు. ఏడాదిపాటు చీపుర్లు చేతపట్టి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని నాడు హామీ ఇచ్చిన డాక్టర్ డీఆర్కే ప్రసాద్ నేతృత్వంలో స్వచ్ఛోద్యమం పదేళ్లు గా కొనసాగుతూ చల్లపల్లి రూపురేఖలనే మార్చివేసి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. డాక్టర్ పద్మావతి చొరవతో సుందరీకరణ, డాక్టర్ గురవారెడ్డి ప్రోత్సాహంతో సమూలమైన మార్పులు వచ్చాయన్నారు. ఇటీవల మచిలీపట్నం వచ్చిన సీఎం చంద్రబాబు స్వచ్ఛసారథి డాక్టర్ డీఆర్కే ప్రసాద్‌తో స్వ చ్ఛ కార్యక్రమాలపై మాట్లాడి అభినందించారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ త్వరలో వచ్చి ప్రోత్సాహం అందిస్తారన్నారు.
గాంధీజీని చూసినట్టే.. డాక్టర్ గురవారెడ్డి
డాక్టర్ డీఆర్కే ప్రసాద్‌ను చూస్తుంటే ఈ రో జుల్లో గాంధీజీని చూసినట్టు ఉంటుందని కిమ్స్ సన్‌షైన్ హాస్పటల్స్ అ ధినేత డాక్టర్ ఏవీ గురవారెడ్డి అన్నారు. స్వచ్ఛ చల్లపల్లి ద్యమం కొనసాగాలనీ, ప్రధానమంత్రి దృష్టికి చేరాలని ఆకాంక్షించారు. డీఆర్కే, పద్మావతి దంపతులుండటం గ్రామం చేసుకున్న అదృష్టమని, ఇలాంటి కార్యకర్తలు దొరకటం వారి అదృష్టమన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వచ్ఛ ఉద్యమానికి మరో పిల్లర్ అని, వరప్రసాద్‌రెడ్డి లాంటి వ్యక్తుల సహకారం ఉద్యమానికి మరింత బలమన్నారు.
స్వచ్ఛ కార్యకర్తలదే ఘనత.. డాక్టర్ డీఆర్కే ప్రసాద్
స్వచ్ఛ చల్లపల్లి సార థి డాక్టర్ డీఆర్కే ప్రసా ద్ మాట్లాడుతూ, స్వచ్ఛ కార్యకర్తల శ్రమదానం, సమయదానం కారణంగానే గ్రామం బావుంద నీ, చల్లపల్లిలో ఇలాంటి కార్యకర్తల మధ్య ఉండటం అదృష్టమన్నా రు. చల్లపల్లిలో ప్రజల ఐక్యత చూసి ఎంద రో ప్రముఖులు ఆశ్చర్యపోయారనీ, స్మశానవాటిక శుభ్రం చేసే సమయంలో వారి శ్రమను వర్ణించలేమన్నారు. కార్యకార్తలే స్వచ్ఛ ఉద్యమానికి పునాది అనీ, ఇదంతా సమష్టి కృషి ప్రకటించారు. డీఆర్కే, పద్మావతి దంపతులంటూ ఎవరు మెచ్చుకున్నా స్వచ్ఛ కార్యకర్తలను మెచ్చుకున్నట్లేనన్నారు.
లక్షల అడుగులు వేసిన స్వచ్ఛ కార్యకర్తలు.. డాక్టర్ పద్మావతి
సుందర చల్లపల్లి సారథి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ గాంధీజీ స్వచ్ఛత వైపు ఒక అడుగంటే స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు లక్షల అడుగులు వేశారన్నారు. స్వచ్ఛ కార్యకర్తల ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతోందన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లే కుంటే స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం లేదనీ, స్వ చ్ఛ కుటుంబానికి వారే పెద్ద దిక్కు అన్నా రు. ఊరి అభివృద్ధి కోసం చేసే నిస్వార్ధ సేవకు కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీల కు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సహ కరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
స్వచ్ఛ ఉద్యమం స్ఫూర్తిదాయకం.. ఎన్నారై నాదెళ్ల సురేష్
ప్రవాస భారతీయులు నాదెళ్ల సురేష్ మాట్లాడుతూ చల్లపల్లిలో స్వచ్ఛ ఉద్యమం స్ఫూర్తివంతమైనదన్నారు. కార్యకర్తలు కష్టపడుతుండబట్టే తాను అమెరికాలో తనవంతుగా ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛ కార్యకర్తలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదన్నారు.
స్వచ్ఛ కార్యకర్తలవే ఈ అవార్డులన్నీ.. సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి
చల్లపల్లి సర్పంచ్ పై డిపాముల కృష్ణకుమారి మాట్లాడుతూ పదేళ్లుగా ఉద్యమంలో తానూ భా గస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నా రు. సర్పంచ్‌గా గౌరవా న్ని, అవార్డులనూ తీసుకుంటే స్వచ్ఛ కార్యకర్తలందరూ తీసుకున్నట్లేనన్నారు. డీఆర్కే దంపతుల కృషి, కార్యకర్తల శ్రమ చిరస్మరణీయమన్నారు. చల్లపల్లి ఎంపీపీ కోట విజయరాధిక, ఉపసర్పంచ్ ముమ్మనేని నాని, ఎంపీటీసీ పైడిపాముల స్వప్న, షేక్ నబీఘోరి, వైద్యప్రముఖులు డాక్టర్ భార్గవి, డాక్టర్ డి.శివప్రసాద్, డాక్టర్ ఎం.వరప్రసాద్, పర్యావరణవేత్త ఉదయ్‌సింగ్ గౌతమ్, విశ్రాంత అధికారులు కె.హరిరాజేంద్రబాబు, దాసి సీతారామరాజు, డీఆర్వో సీసీ తూము వెంకటేశ్వరరావు, ఈవో పివి.మాధవేంద్రరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, ప్రముఖులు అడపా రాంబాబు, యార్లగడ్డ శివప్రసాద్, మండవ బాలవర్ధిరావు, వరదా హరిగోపాల్, చోడగం విమల్‌కృష్ణ, యద్ధనపూడి మధు, మోర్ల శివ, జాస్తి ప్రసాద్, బోలెం రామారావు, రాయపాటి రాధాకృష్ణ, ప్రాతూరి శాస్త్రి, స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
తొలుత జాతీయ రహదారి పక్కనే అతిథులు మొక్కలు నాటారు. నూతనంగా ఏర్పాటుచేసిన స్వచ్ఛ సుందర చల్లపల్లి సైనేజ్ బోర్డును ప్రారంభించారు. అభివృద్ధి పరిచిన రహదారిని గంగులవారిపాలెం పెద్ద కొండపల్లి బాలకోటయ్య అతిథుల సమక్షంలో ప్రారంభించారు. చల్లపల్లి రాజా కళాశాల వద్ద నుంచీ చల్లపల్లి గ్రామ పంచాయతీ వరకూ భారీ పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా డప్పువాయిద్యాల నడుమ స్వచ్ఛ కార్యకర్తలు, కళాకారులు ఆటపాటలతో సందడిచేశారు. సమావేశం జరిగిన స్వగృహ బాంకెట్ హాలులో శ్రీమెహర్ నృత్యాలయ విద్యార్థినులులు పర్యావరణహితమైన పాటకు అద్భుతంగా నాట్యంచేశారు. యూఎ్‌సలో మారథాన్ చేసిన నాదెళ్ల సురేష్, స్థానిక వ్యాపారవేత్త నాదెళ్ల యోగ వెంకటేశ్వరరావులను డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ డీఆర్కే పద్మావతి దంపతుల చేతులమీదుగా రోటరీక్లబ్ అధ్యక్షుడు నూతక్కి శివబాబు సత్కరించి జ్ఞాపికలు అందించారు.