Share News

నలుగురిపై ఎలుగుబంట్ల దాడి.. తీవ్ర గాయాలు

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:14 AM

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. గురువారం వేర్వేరు గ్రామాల్లో నలుగురిపై దాడి చేయగా..

నలుగురిపై ఎలుగుబంట్ల దాడి.. తీవ్ర గాయాలు

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 1: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీలో ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. గురువారం వేర్వేరు గ్రామాల్లో నలుగురిపై దాడి చేయగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చీపురుపల్లి పంచాయతీ గడూరు గ్రామానికి చెందిన పిన్నాసి కుమారస్వామి(60), పిన్నాసి చలపతి గురువారం ఉదయం చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో జీడితోట వద్ద తల్లీ పిల్ల ఎలుగుబంట్లు కుమారస్వామిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. డెప్పూరుకు చెందిన లైశెట్టి నారాయణమ్మ(65) తన జీడితోటలో కంచె వేస్తుండగా ఎలుగుబంట్లు దాడి చేశాయి. దీంతో ఆమె తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. డెప్పూరుకు చెందిన శీలం తాతారావు, పోకల ఊర్మిళ కూలి పనులకు వెళ్తుండగా ఎలుగుబంట్లు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వారు బిగ్గరగా అరవడంతో అవి జీడితోటల్లోకి పారిపోయాయి.

Updated Date - Feb 02 , 2024 | 08:20 AM