టీడీపీలోకి మాజీ మేయర్ తాడి శకుంతల
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:22 AM
విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల టీడీపీలో చేరారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో యువనేత లోకేశ్ ఆమెకు పసుపు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
కేశినేని చిన్ని ఆధ్వర్యంలో భారీగా చేరికలు
అమరావతి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల టీడీపీలో చేరారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో యువనేత లోకేశ్ ఆమెకు పసుపు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే విజయవాడకు చెందిన నగరాల సామాజిక వర్గ ప్రముఖులు టీడీపీలో చేరారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలు టీడీపీ తీర్థం తీసుకున్నాయి.