పోలీసుల వేధింపులు తాళలేక మత్స్యకారుడు ఆత్మహత్య
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:06 AM
పోలీసుల వేధింపులు తాళలేక మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోటుకు ఉన్న తాడు మెడకు చుట్టుకుని నదిలోకి దూకి బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి
బోటుకున్న తాడు మెడకు చుట్టుకుని నదిలో దూకి బలవన్మరణం
వెల్దుర్తి, జనవరి 28: పోలీసుల వేధింపులు తాళలేక మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోటుకు ఉన్న తాడు మెడకు చుట్టుకుని నదిలోకి దూకి బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. ఈ సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని బంగారుపెంట తండాలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన చవిటిపల్లి దుర్గారావు (38) కృష్ణానదిలో చేపలవేట వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన అక్రమ మద్యం విక్రయిస్తున్నాడంటూ పోలీసులు గతనెలలో అతనిపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో దుర్గారావు హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ప్రతి ఆదివారం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు వెళ్తే పోలీసులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన ఆయన బోటులో ఉన్న తాడు మెడకు చుట్టుకుని నదిలోకి దూకాడు. బోటును గమనించిన మత్స్యకారులు అక్కడకు వెళ్లి బోటుకు కట్టి ఉన్న తాడును పైకి లాగగా దుర్గారావు నిర్జీవస్థితిలో కనిపించాడు. మృతునికి భార్య ధనలక్ష్మి, ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసుల వేధింపులు తాళలేకనే దుర్గారావు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. రూ.2 లక్షలు ఇవ్వాలని, వైసీపీ కండువా కప్పుకోవాలని పోలీసులు పదేపదే వేధించారని చెప్పారు. దుర్గారావు మృతదేహంతో వెల్దుర్తి పోలీ్‌సస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. కాగా, దుర్గారావు మృతికి కారణమైన వెల్దుర్తి ఎస్‌ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు.