Share News

రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల్లేవ్‌..

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:43 PM

పుష్కళంగా వర్షాలు కురుస్తున్నాయి. దుక్కులు దున్ని పొలాలను రైతులు సిద్ధం చేసుకున్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల్లేవ్‌..

ఆందోళనలో అన్నదాతలు

మద్దికెర, జూన్‌ 8: పుష్కళంగా వర్షాలు కురుస్తున్నాయి. దుక్కులు దున్ని పొలాలను రైతులు సిద్ధం చేసుకున్నారు. వర్షం ఆగిపోతే విత్తన సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్‌బీకే కేంద్రాల్లో ఎరువుల్లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. మండలంలో మొత్తం 11 గ్రామాలున్నాయి. 7,500 హెక్టార్ల సాగుభూమి ఉంది. పెరవలి, మద్దికెర, బురుజుల, ఎం.అగ్రహారం గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ఇప్పటికే ఆరంభమై కొంత మంది రైతులు బోరుబావుల కింద వేరుశనగ పంటను సాగు చేశారు. ఎరువులు లేకపోవడంతో పట్టణ ప్రాంతాలకెళ్లి మందులు తెచ్చుకొని సేద్యం చేస్తున్నారు. అలాగే వర్షాదారం కింద వేరుశనగ, కంది పంటల సాగుకు సేద్యం పూర్తి చేసుకుని విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా వేరుశనగ విత్తనాలు విత్తే సమయంలో ఆ తర్వాత పూత పిండే దశలో మందులు ఎక్కువగా వాడతారు. రైతుభరోసా కేంద్రంలో యూరియా కానీ, డీఏపీ పొటాష్‌ కానీ 102626, 143114, 2020013 మందులు రైతులకు చాలా అవసరం. కానీ ఆర్బీకేల్లో ఏ మందులు లేవు. దీంతో ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా మందులు లేకపోవడంతో గుంతకల్లు, పత్తికొండ, ఆదోని ప్రాంతాలకు వెళ్లి ఎరువులు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై వ్యవసాయాశాఖ అధికారి ఉప్పరి రవి మాట్లాడుతూ మందులు ప్రస్తుతానికి నిల్వ లేవని, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కోరమాండల్‌ ద్వారా రైతులకు విత్తన పంపిణీ చేస్తామని వివరణ ఇచ్చారు.

Updated Date - Jun 08 , 2024 | 11:43 PM