Share News

బ్యాంకు బంద్‌కు రైతుల యత్నం

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:59 PM

తమ సమస్య పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్న బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు యూనియన బ్యాంక్‌ బంద్‌కు మంగళవారం యత్నించారు.

బ్యాంకు బంద్‌కు రైతుల యత్నం

కణేకల్లు, ఏప్రిల్‌ 2: తమ సమస్య పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్న బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు యూనియన బ్యాంక్‌ బంద్‌కు మంగళవారం యత్నించారు. గత 15 రోజుల క్రితం యూనియన బ్యాంకు పరిధిలో రైతులు తీసుకున్న వ్యవసాయరుణాలకు సంబంధించి వడ్డీ మాత్రమే కట్టించుకునేలా చూడాలని బ్యాంకు అధికారులను కోరారు. వారు ఈ సమస్యను ఉన్నతాధికారులకు వివరించి 15 రోజులలోపు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంగళవారం రైతుసంఘం అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, సీపీఎం నాయకులు కోరి నాగరాజు ఆధ్వర్యంలో రైతులంతా బ్యాంకును ముట్టడించి బ్యాంక్‌ బంద్‌కు యత్నించారు. దీంతో బ్యాంకు అధికారులు బయటకు వచ్చి మరోసారి రైతుల సమస్యలకు సంబంధించి వినతిపత్రాన్ని తీసుకున్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:59 PM