పిడుగుపాటుకు రైతు, ఆవు మృతి
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:11 AM
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం పోచనపల్లిలో ఆదివారం పిడుగుపడి రైతు ఉప్పర లక్ష్మయ్య (65) మృతి చెందాడు.
హిందూపురం అర్బన్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం పోచనపల్లిలో ఆదివారం పిడుగుపడి రైతు ఉప్పర లక్ష్మయ్య (65) మృతి చెందాడు. అతని పాడి ఆవు కూడా మరణించింది. లక్ష్మయ్య.. తన రెండు ఆవులను మేపేందుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం వర్షం ప్రారంభమవడంతో ఇంటికి ప్రయాణమయ్యాడు. దారిలో పిడుగుపడడంతో లక్ష్మయ్య, ఓ ఆవు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆవు మాత్రం సాయంత్రం ఇంటికి చేరుకుంది. లక్ష్మయ్య, మరో ఆవు రాకపోవడంతో కుటుంబీకులు గాలించగా, పొలాల్లో నిర్జీవంగా పడి ఉండడాన్ని గమనించారు.