Share News

‘ఫ్యాన్‌’కు ఉరి! వేసింది జగనే!

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:46 AM

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటారు. కానీ, ‘ఫ్యాన్‌’కే ఉరేశారు జగన్‌! వైసీపీ ఎన్నికల చిహ్నం ఫ్యాన్‌..

‘ఫ్యాన్‌’కు ఉరి! వేసింది జగనే!

పాతాళానికి పడిన ‘ప్యాలెస్‌’ రాజా!

చరిత్ర లో నిలవాలంటూ చారిత్రక తప్పులెన్నో

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటారు. కానీ, ‘ఫ్యాన్‌’కే ఉరేశారు జగన్‌! వైసీపీ ఎన్నికల చిహ్నం ఫ్యాన్‌.. టీడీపీ కూటమి సృష్టించిన సునామీతో ఊడ్చుకుపోయింది. అయితే, ఇదంతా జగన్‌ స్వయంకృతమే. అవి 2019 ఎన్నిక లు! ‘నాకు ఒక్క చాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌’..‘రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తా’ అంటూ వైసీపీ నేత జగన్‌ ప్రజలను ప్రాధేయపడ్డారు. అప్పటికే జగన్‌పై అవినీతి, అక్రమాస్తులు కేసులు ఎన్నో ఉన్నాయి. జైలు జీవితం గడిపారు. అయినా సరే జగన్‌కు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవినీతిపరుడని తెలిసినా పీఠమెక్కించారు. అయితే, ప్రజాధనంతో టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మితమైన ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ తన పాలన ప్రారంభించారు. ఆ తర్వాత అంతా విధ్వంసమే అజెండాగా ఆయన పాలన ప్రజాకంఠకంగా సాగింది.

కరోనాతో రాజకీయ క్రీడ

కరోనా ప్రపంచాన్ని ఒకవైపు చుట్టేస్తుంటే, ఏపీని జగన్‌ అరాచకాలు మరోవైపు అల్లుకుపోయాయి. ఒకవైపు భయంకరమైన కరోనాతో ప్రజల ప్రాణాలు పోతున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టారు. అది సాధ్యం కాదన్నందుకు నాటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌ను ఇంటికి పంపించాలని కుయుక్తులు పన్నారు. చివరకు దౌర్జన్యాలు, దాదాగిరితో స్థానికసంస్థలను ఏకగ్రీవం చేసుకున్నారు. జగన్‌ ఒంటెత్తుపోకడలు, నియంత చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లమీదకు వచ్చారు. తిరగబడ్డ జనంపై క్కుపాదం మోపారు. దీనికోసం పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా వాడుకున్నారు.


న్యాయమూర్తులపైనా దాడులు..

ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన, తప్పుపట్టిన కోర్టులు, న్యాయమూర్తులను వ్యక్తిగ తంగా టార్గెట్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా న్యాయమూర్తులను దూషించారు. జగన్‌ దావోస్‌, లండన్‌ పర్యటనలకు వెళ్తే, జడ్జీలను దూషించిన కేసుల్లో నిందితులు అక్కడ ప్రత్యక్షమవ్వడం, జగన్‌ అండ్‌కోతో ఫొటోలు దిగడం, సీఐబీకి సవాల్‌ విసరడం ఓ అలవాటుగా మారిపోయాయి. చివరకు సీబీఐతో విచారణ చేయించినా దోషులు దర్జాగా తిరుగుతున్నారు. మరోవైపు లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు, ప్రజలు ఆయనను కలవకుండా చేసేందుకు రోడ్లపై ఆంక్షలు విధిస్తూ బ్రిటీషు చట్టాలను అమలు చేయాలనుకున్నారు. జీవో-1ని తీసుకొచ్చి ప్రజల పోరాట హక్కును అణచాలనుకున్నారు. కానీ, చివరకు న్యాయమే గెలిచింది. జీవో రద్దైంది.

పాస్‌ పుస్తకాలపై జగన్‌ వంశవృక్షం..

దేశంలో ఎప్పుడో 1927లో బ్రిటీషు పాలకులు భూముల సర్వే చేపట్టారు. ఆ సర్వేనే నేటికి ప్రామాణికంగా ఉంటోంది. ఆ తర్వాత తానే 100 ఏళ్ల తర్వాత భూముల సర్వే చేపడతానని జగన్‌ చెప్పారు. తన తండ్రి, తాత పేరు కలిసొచ్చేలా వైఎ్‌సఆర్‌, జగనన్న శాశ్వత భూ హక్కు పేరిట 2020లో సర్వే మొదలుపెట్టారు. కానీ జగన్‌ ఆ పని సరిగ్గా చేయలేకపోయారు. పాస్‌పుస్తకాలు ఇచ్చాక తమ భూ ముల విస్తీర్ణంలో, కొ లతల్లో తేడాలు వచ్చాయని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇవే పాస్‌పుస్తకాలపై జగన్‌ తండ్రి, ఆయన తాత రాజారెడ్డి పేర్లు కలిసొచ్చేలా వైఎ్‌సఆర్‌ అని, ఆ తర్వాత తన పేరును ముద్రించారు. వీటిని రైతులు తిరస్కరించారు. ప్రభుత్వ వేదికమీదే చింపేశారు.

చట్టాలనే మార్చేశారు..

సర్వేపేరిట చట్టాలను మార్చి చారిత్రక తప్పిదాలు చేశారు. సర్వే, సరిహద్దుల చట్టాలను ఇష్టారీతన మార్చేశారు. రైతులకు శాశ్వత భూహక్కు కల్పించే పేరిట టైటిల్‌ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం అనేక కేంద్ర చట్టాలను ధిక్కరించేలా ఉంది. భూ వివాదాలు వస్తే రైతులు సివిల్‌ కోర్టులకు వెళ్లకుండా రైతు వ్యతిరేక క్లాజులను చేర్చారు. పక్కా పట్టా భూమిపై కూడా వివాదాలు రాజేసేలా చట్టం అవకాశం కల్పిస్తోంది. వివాదాలు వచ్చిన భూములను డిస్పూట్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి టైటిల్‌ ఖరారు చే యని పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ పరిణామాలకు తోడు శాశ్వత భూహక్కు కింద ఇచ్చే పాసు పుస్తకాల నిండా జగన్‌ బొమ్మలే వేశారు. ఇవన్నీ రైతులకు కంటగింపుగా మారాయి. ఎవరో అనామక వ్యక్తి వచ్చి రైతు భూమిపై వివాదం రాజేస్తే దాన్ని డిస్ఫూట్‌లో పెట్టే ఈ చట్టం వద్దని యావత్‌ రాష్ట్రం నినదించింది. రైతాంగం, రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. జగన్‌కు మరో అవకాశం ఇస్తే జీవితాలే తారుమారు అవుతాయన్న భయంతో ఆయనను ఇంటికి సాగనంపారు.

Updated Date - Jun 05 , 2024 | 04:46 AM