Share News

ఏపీ ప్రభుత్వ లోగోతో ఫేక్‌ ఖాతా

ABN , Publish Date - Oct 09 , 2024 | 04:00 AM

ప్రముఖ సామాజిక మాధ్యమంలో ఏపీ ప్రభుత్వ లోగోతో ఓ ఖాతా... దానిలో వచ్చే సందేశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలే. ‘

ఏపీ ప్రభుత్వ లోగోతో ఫేక్‌ ఖాతా

చంద్రబాబు, కూటమిపై విమర్శలే ప్రధానం

సీఎం వయసునూ హేళన చేస్తూ వ్యాఖ్యలు

పోలీసులు, హోం మంత్రికి పట్టని వైనం

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సామాజిక మాధ్యమంలో ఏపీ ప్రభుత్వ లోగోతో ఓ ఖాతా... దానిలో వచ్చే సందేశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలే. ‘ఫేక్‌చెక్‌ ఏపీ జీవోవీ’(ఊ్చజ్ఛుఇజ్ఛిఛి జుఅఞఎౌఠి) పేరుతో ఆ ఖాతా ఉంది. దీనిలో పోస్టు చేసిన రెండు సందేశాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అవే పోలీసులు, హోం మంత్రి తీరుపై విమర్శలకు కారణం అయ్యాయి. సెప్టెంబరు 18న పెట్టిన ఓ సందేశంలో... ‘ఆవు అనేది ఒక జంతువు. అంటే ఇంగ్లీషులో యానిమల్‌. ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో ఆవు కొవ్వు కాకుండా మనిషి కొవ్వు ఉంటుందా? ప్రస్తుత సీఎం వయస్సు 75 సంవత్సరాలు. ఈ వయస్సులో తప్పలు మాట్లాడడం సహజం. కావున ఆంధ్ర ప్రజలు ఇతని మాటలు పట్టించుకోనవసరం లేదని టీటీడీ దేవస్థానము వారు కోరడమైనది’ అని పేర్కొన్నారు. అలాగే 4 రోజుల క్రితం .ఫేక్‌ న్యూస్‌ అలర్ట్‌’ శీర్షికతో వచ్చిన మరో సందేశంలో... ‘అధికార తెలుగు పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలు నిజం కాదు. తిరుమల లడ్డూ వివాదంలో రాష్ట్ర దర్యాప్తు సంస్థలపైన పూర్తిగా నమ్మకం లేక సీబీఐ విచారణ కావాలని సుబ్బారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు’ అని పేర్కొన్నారు. సదరు ఖాతా పేరు దిగువన ఇచ్చిన వివరణలో ‘అఫీషియల్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఫేక్‌ చెక్‌ వింగ్‌ ఆఫ్‌ ఫెడరల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌. రిపోర్ట్‌ ఎనీ మిస్‌లీడింగ్‌ పోస్ట్‌/ట్వీట్‌ ఎట్‌ ఫేక్‌చెక్‌ యాప్‌ ఎట్‌ ప్రొటాన్‌.మీ’ అని రాసుకున్నారు. ఆగస్టు 2024న ప్రారంభమైన ఈ ఫేక్‌ ఖాతాపై సైబర్‌ పోలీసులు దృష్టి సారించకపోవడాన్ని పలువురు టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.

Updated Date - Oct 09 , 2024 | 07:13 AM