రెండు రైళ్లు పొడిగింపు
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:12 AM
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళ గమ్యస్థానాలను పొడిగించిన క్రమంలో నంద్యాల మీదుగా రెండు ఎక్స్‌ఫ్రెస్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికార వర్గాలు గురువారం తెలిపారు. అమరావతి, కడప డెమో రైళ్ళను పొడిగించినట్లు చెప్పారు.

నంద్యాల (నూనెపల్లె), జనవరి 11: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళ గమ్యస్థానాలను పొడిగించిన క్రమంలో నంద్యాల మీదుగా రెండు ఎక్స్‌ఫ్రెస్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికార వర్గాలు గురువారం తెలిపారు. అమరావతి, కడప డెమో రైళ్ళను పొడిగించినట్లు చెప్పారు. 17225/17226 హుబ్లీ - విజయవాడ అమరావతి ఎక్స్‌ఫ్రెస్‌ను నర్సాపూర్ వరకు పొడిగిస్తూ ఆ రైలును 12వ తేదీన నర్సాపూర్‌లో, 07284/07285 నంద్యాల - కడప డెమో రైల్‌ను రేణుగుంట వరకు పొడిగిస్తూ ఆ రైలును 13వ తేదీన రేణిగుంటలో రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 17225 నర్సాపూర్ - హుబ్లీ రైలు నర్సాపూర్‌లో సాయంత్రం 4.10 గంటలకు బయలు దేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడల మీదుగా విజయవాడకు 7.40కి చేరుకొని, 7.55కు విజయవాడ నుంచి బయలు దేరి గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంబం, గిద్దలూరు మీదుగా తెల్లవారు జామున 2.20 గంటలకు నంద్యాలకు చేరుకుంటుందని అన్నారు. 17226 హుబ్లీ - నర్సాపూర్ ఎక్స్‌ఫ్రెస్ రైలు హుబ్లీలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి నంద్యాలకు రాత్రి 9.10కి చేరుకొని తెల్లవారు జామున 3.40కి విజయవాడకు చేరుకుంటుందని, అక్కడి నుంచి కేటాయించిన మార్గంలో ఉదయం 7.40 గంటలకు నర్సాపూర్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. 07284 రేణుగుంట - నంద్యాల వరకు డెమో రైలు రేణుగుంటలో 13వతేదీ మధ్యాహ్నం 1.45 గంటలకు బయలుదేరి సూచించిన మార్గంలో నంద్యాలకు రాత్రి 8 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. అలాగే 07285 నంద్యాల - రేణుగుంట డెమో రైలు నంద్యాలలో ఉదయం 5.40 గంటలకు బయలుదేరి బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, నొస్సం, ఉప్పలవాడు, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, కడపకు ఉదయం 9.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, కోడూరు, బాలేపల్లె మీదుగా రేణుగుంటకు మధ్యాహ్నం 12.40 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.