మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్యపై కత్తితోదాడి
ABN , Publish Date - May 12 , 2024 | 12:27 AM
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపాల్ చైర్మన్ బుట్టా రంగయ్యపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది.

కేసు నమోదు
బుట్టా రేణుక సోదరుడు యుగంధర్‌పై
చర్యలు తీసుకోవాలి
ఎమ్మిగనూరు మే 11: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపాల్ చైర్మన్ బుట్టా రంగయ్యపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. శనివారం బాధితుడు తెలిపిన వివరాల మేరకు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ వేధింపులు, బెదిరింపులు తాళలేక రెండు రోజుల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేశా. దీన్ని జీర్ణించుకోలేని యుగంధర్ నాపై నా సమీప బంధువులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పాడు. నా భార్య సోదరుడు నాతో గొడవకు దిగి నన్ను తీవ్రంగా అవమానపరిచేలా మాట్లాడటేమేకాక కత్తితో నాపై దాడికి దిగాడు. అతడి అతడి బారి నుంచి తప్పించుకునేందుకు చేతిని అడ్డుపెట్టా. రక్తగాయమైంది. దాడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశా’’ అని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాయడిన తనను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. నాపై దాడి చేయించిన యుగంధర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. వైసీపీకి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే మున్సిపాల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్యపై దాడి జరగడంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.