Share News

కోర్టు స్టే ఉన్నా రైతుల భూముల్లో తవ్వకాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:01 AM

పశ్చిమ బైపాస్‌ పనుల్లో భాగంగా హైటెన్ష న్‌ విద్యుత్‌ స్తంభాల మార్పిడి వి షయంలో హైకోర్టు స్టే ఇచ్చినా మె ఘా సంస్థ బేఖాతరు చేసింది.

కోర్టు స్టే ఉన్నా రైతుల భూముల్లో తవ్వకాలు

విజయవాడ రూరల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బైపాస్‌ పనుల్లో భాగంగా హైటెన్ష న్‌ విద్యుత్‌ స్తంభాల మార్పిడి వి షయంలో హైకోర్టు స్టే ఇచ్చినా మె ఘా సంస్థ బేఖాతరు చేసింది. రై తులకు తెలియకుండా గురు, శుక్రవారాల్లో వారి పొలాల్లో తవ్వకాలు జరపి నిర్మాణ పనులు చేపట్టడా న్ని శనివారం రైతులు గుర్తించారు. సంస్థ చర్యలపై కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైతుల ఆందోళనతో వెనక్కి తగ్గిన సంస్థ పనులను నిలిపివేసి తవ్విన గోతులను పూడ్చివేసింది. వివరాల్లోకి వెళితే కొంతకాలంగా రూరల్‌ మండలంలోని పలు గ్రామాల పరిధిలో రైతుల అనుమతులు లేకుండా మెఘా సంస్థ వారి పొలాల్లో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు కోసం తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో రైతులు వరుస ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై గత నెల 24న రైతులు హైకోర్టును ఆశ్రయుంచగా కోర్టు పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి భూములు కోల్పోతున్నామని తెలియజేయగా ఆయన స్వయంగా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కూడిన కమిటీని వేశారు. అయినా సంస్థ వెనక్కి తగ్గకుండా రెండు రోజులు గా పొలాల్లో తవ్వకాలు చేపట్టి కాంక్రీట్‌ పనులు చేస్తోంది. దీనిపై రైతులు మరోమారు ఆందోళన వ్యక్తం చేస్తూ కొత్తపేట సీఐ కొండలరావుకు ఫిర్యాదు చేశారు. అలాగే రైతులు తవ్వకాలు జరిపిన ప్రాంతానికి వెళ్లి గోతులను పూడ్చాలని డి మాండ్‌ చేయడంతో వెనక్కితగ్గిన సంస్థ సిబ్బంది తవ్వినగోతులను పూడ్చివేశారు.

Updated Date - Dec 22 , 2024 | 01:02 AM