దరఖాస్తుల ప్రక్రియ పరిశీలించిన ఎక్సైజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:30 AM
జిల్లాలో నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో మద్యం షాపులు ఏర్పాటుకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ఏలూరులో ఎక్సైజ్ కార్యాలయం లో గురువారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా పరిశీలించారు.
ఏలూరు క్రైం, అక్టోబరు 3 : జిల్లాలో నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో మద్యం షాపులు ఏర్పాటుకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ఏలూరులో ఎక్సైజ్ కార్యాలయం లో గురువారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా పరిశీలించారు. ఆన్‌లైన్ ద్వారా మద్యం షాపులు ఏర్పాటుకు ఎన్ని దరఖాస్తులు అందా యని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మద్యం డిపో ను పరిశీలించారు. ఆయన వెంట జేసీ ధాత్రిరెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ప్రభు కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య, ఐసీ ధనరాజ్, ప్రభృతులు పల్గొన్నారు.
34 దరఖాస్తులు
మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సు మంజూరు చేసే నిమిత్తం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. ఈనేప థ్యంలో ఈనెల 2న కైకలూరు మండలానికి రెండు దరఖాస్తులు వచ్చాయి. మూడో తేదీన జిల్లా వ్యాప్తంగా 32 దరఖాస్తులు వచ్చాయి. చింతలపూడి 16, నూజివీడు ఆఫ్‌లైన్‌లో 6, ఆన్‌లైన్‌లో 2, ఏలూరు 1, కైకలూరు 7 దర ఖాస్తులు వచ్చాయి.