ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 12 , 2024 | 12:31 AM
ఈనెల 13న జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధమని ఆదోని ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు.

ఆదోని ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
ఆదోని, మే 11: ఈనెల 13న జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధమని ఆదోని ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. శనివారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆదివారం జరిగే డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు, అందులో రూరల్ 97, అర్బన్ 159 కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.