అక్రమాల పత్రిక అవినీతి పుత్రిక ‘సాక్షి’
ABN , Publish Date - Oct 31 , 2024 | 05:20 AM
మానవాతీత శక్తులు ఉన్నవాళ్లు శూన్యంలో నుంచి సిరిసంపదలు సృష్టించడాన్ని పురాణగాథల్లో చూశాం.
పైసా పెట్టుబడి లేకుండా పత్రిక, చానల్ ఏర్పాటు
నాడు తండ్రి సీఎంగా ఉన్నప్పుడు
‘మేళ్లు’ పొందినవారితో పెట్టుబడులు
ఇష్టానుసారం షెల్ కంపెనీల ఏర్పాటు
అవినీతి సొమ్ము విదేశాలకు పంపి
అక్కడి నుంచి మళ్లీ జగన్ కంపెనీల్లోకి
సండూర్ పవర్ నుంచి కార్మెల్ ఏషియాకు
దాని ద్వారా జగతి, ఇందిరా టెలివిజన్‌కు
వందల కోట్ల సంస్థలకు జగన్ అధినేత
మాఫియా డాన్‌లు, వేర్పాటువాదులూ ఏదో ఒక ముసుగులో మీడియాను స్థాపించి తమ ‘సిద్ధాంతాల’ను జనంలోకి చొప్పించడం కుదురుతుందా? కుదరనే కుదరదు! అందుకు చట్టాలు అంగీకరించవు. అలాగే... ఈ దేశంలో చట్టాలు, వ్యవస్థలు నిక్కచ్చిగా దృష్టి పెడితే... జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల్లో ఒకటైన మీడియా రంగంలోకి ప్రవేశించిన అవినీతి పుత్రిక... జగన్ సాక్షి! చిరునామాలేని కంపెనీలు, ఆధారాలు లేని ఆదాయాలు, అనుమానాస్పద పెట్టుబడులతో పురుడు పోసుకుంది! జగన్ అధికారం సాధించడమే లక్ష్యంగా... అసత్యాలు చెప్పడమే పనిగా సాగుతోంది. ఈ పెట్టుబడుల బాగోతాన్ని సీబీఐ, ఈడీ ఎప్పుడో బయట పెట్టాయి.
జగన్ తన రోత మీడియాలో సొంతంగా రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. అసలు ఎవరు పెట్టుబడి పెట్టారో కూడా తెలియదు. ఇష్టానుసారం ఎడాపెడా షెల్ కంపెనీలు సృష్టించి, చట్టాలను ఉల్లంఘించి అందులోకి విదేశీ పెట్టుబడులు రప్పించారు. అంటే.. ఈ లెక్కన దావుద్ ఇబ్రహీంలాంటి మాఫియా డాన్‌లు, వేర్పాటు వాదులూ పత్రికలు పెట్టొచ్చన్న మాట!
నాడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ‘మేళ్లు’ పొందినవారు అందుకు ప్రతిఫలంగా జగన్‌కు లబ్ధి చేకూర్చారు. అంటే.. క్విడ్ ప్రోకో. అవినీతి సొమ్మును అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించి, పెట్టుబడుల రూపంలో మళ్లీ తన కంపెనీల్లో పెట్టారు. చట్టాలు సరిగా పనిచేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే జగన్ రోత మీడియానే ఉండదు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మానవాతీత శక్తులు ఉన్నవాళ్లు శూన్యంలో నుంచి సిరిసంపదలు సృష్టించడాన్ని పురాణగాథల్లో చూశాం. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు జగన్‌కు కూడా అలాంటి అతీంద్రీయ శక్తులు ఉండి ఉంటాయి కాబో లు! ఎందుకంటే.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా వందల కోట్ల విలువైన సాక్షి పత్రిక, చానల్, వాటిని నడిపే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్‌కు అధిప తి అయ్యారు. వీటిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీ లు నాడు రాజశేఖరెడ్డి ప్రభుత్వంలో అడ్డగోలుగా లబ్ధిపొందినవే అన్న అభియోగాలున్నాయి. షెల్ కంపెనీలను పుట్టించి, అక్రమంగా విదేశీ పెట్టుబడుల రూ పంలో స్థాపించారు. అవినీతి సొమ్ముతో స్థాపించిన రోత మీడియాకు నిజమైన వారసులు ఎవరు? అసలై న యజమాని ఎవరు?
సండూర్‌తో మొదలై...
1998లో జగన్ సండూర్ పవర్ అనే కంపెనీని టేకోవర్ చేశారు. వైఎస్ సీఎం అయ్యాక ఆ కంపెనీకి తోడు గొలుసుకట్టు కంపెనీలను పుట్టించారు. ఓ మహా మాయా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశీయ అక్రమార్జనను విదేశాలకు తరలించడం, దొడ్డిదారిన అదే సొమ్మును తన కనుసన్నల్లో ఉండే కంపెనీల్లోకి రప్పించడం అనే ఇంద్రజాలాన్ని ప్రదర్శించారు. దీనికి కేంద్ర బిందువు జగన్ టేకోవర్ చేసిన సండూర్ కంపె నీ. వైఎస్ అధికారంలోకి వచ్చాకే సండూర్ కంపెనీకి వెలుగులోచ్చాయి. నిజానికి 1998లో ఈ కంపెనీని టేకోవర్ చేస్తే, 2005లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 2005లోనే సండూరు పవర్ మరికొన్ని కంపెనీలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి కార్మెల్ ఏషియా హోల్డింగ్స్. ఈ కంపెనీ క్యాపిటల్ 20 కోట్లు కాగా, పెయిడ్ అప్ క్యాపిటల్ 15.22 కోట్లు. సండూర్ పవర్‌లో ప్రమోటర్ల వాటా 62.54ు(33 కోట్లు). 2005లో 2ఐ క్యాపిట ల్ అనే సంస్థకు 1.48 కోట్ల షేర్లను, ప్లూరీ ఎమర్జింగ్ కంపెనీస్ అనే సంస్థకు 26.76 లక్షల షేర్లను రూ.61 ప్రీమియం తో అలాట్ చేశారు. దీని ద్వారా సేకరించిన మొత్తం రూ.124.6 కోట్లు. అంటే 53.41 కోట్ల పెట్టుబడితో కంపెనీని ఏర్పాటు చేసి, అందులోని షేర్లను విక్రయించడం ద్వారా 124 కోట్లను సేకరించారు.
పిల్ల కంపెనీలను పుట్టించి...
సండూర్ కంపెనీ 2005లో కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ సహా అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. 2006 అక్టోబరులో రూ.10 రూపాయల ముఖ విలువతో కార్మెల్ షేర్లను తిరిగి సండూర్ పవర్‌కు జారీ చేశారు. షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన 124 కోట్లలో 15 కోట్లను సండూర్ పవర్.. కార్మెల్ ఏషియాలో పెట్టుబడిగా పెట్టిందన్నమాట. సరిగ్గా సండూర్‌కు షేర్లను జారీ చేసిన 4 నెలల తర్వాత రూ.10 షేర్లనే బయటివాళ్లకు రూ.252 ప్రీమియంతో కార్మె ల్ అలాట్ చేసింది. రూ.10 కు రూ.252 కలిపితే వెరసి రూ.262 అన్నమాట. మొత్తం 24.04 లక్షల షేర్లను రెండు విడతల్లో అమ్మడం ద్వారా రూ.82 కోట్లను సమీకరించింది. సండూర్ అనుబంధ కంపెనీగా ఉన్న కార్మెల్ ఏషియా మరో 2 కంపెనీలను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి జగతి పబ్లికేషన్స్. మరొకటి ఇందిరా టెలివిజన్. కార్మెల్ ఏషియా సమీకరించిన 82 కోట్లలో 73.56 కోట్లను జగతి పబ్లికేషన్స్‌లో, 10.47 కోట్లను ఇందిరా టెలివిజన్‌లో పెట్టుబడిగా పెట్టింది.
పైసా పెట్టుబడి లేకుండా...
2006 నవంబరులో జగతి పబ్లికేషన్స్ ఏర్పాటైంది. అప్పుడు దాని ఆథరైజ్డ్ క్యాపిటల్ రూ.5 కోట్లే. నెల రోజుల్లోనే జగన్ తన మాయాజాలం తో 100 కోట్లకు పెంచారు. 2007 అక్టోబరు నుం చి 2008 మే మధ్య దాదాపు 97.36 లక్షల షేర్లను ఇతర కంపెనీలకు కేటాయించడం ద్వారా 350 కోట్లను సమీకరించుకుంది. రూ.10 చేసే ఒక్కో షేర్‌ను రూ.350తో అలాట్ చేసింది. ఈ రూ.350 కోట్లు, కార్మెల్ ఆసియా సమకూర్చిన 73.56 కోట్లు వెరసి మొత్తం పెట్టుబడి 423.56 కోట్లు.
పెట్టుబడులు ఎలా వచ్చాయి?
జగన్ పత్రిక, టీవీ చానల్ ఏర్పాటుకు కేంద్ర బిందువు కార్మెల్ ఏషియా. దీనికి మూలబిందు వు సండూర్ పవర్. ఈ సంస్థ వ్యాపార విస్తరణకు విదేశీ పెట్టుబడి సంస్థలు 2ఐ క్యాపిటల్, ప్లూరీ ఎమర్జింగ్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టా యి. 22 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలో రూ.61 ప్రీమియంతో పెట్టుబడులు పెట్టడం జగన్మాయే. సండూర్ పవర్‌లో 1.48 కోట్ల షేర్లను కొన్న 2ఐ క్యాపిటల్ తన ప్రతినిధి గా విజయసాయిరెడ్డిని నియమించింది. జగన్ సన్నిహితుడినే బోర్డు సభ్యుడిగా ఎందుకు నియమించినట్లు? అంటే.. జగన్ తన సంపాదనను దారి మళ్లించి 2ఐ క్యాపిటల్‌కు చేర్చి, దాని ద్వా రా తిరిగి తన కంపెనీలోనే పెట్టుబడులు పెట్టించారా? అంటే.. సీఐబీ అవుననే చెబుతోంది. రెం డో కంపెనీ ప్లూరీ ఎమర్జింగ్. స్టాక్ మార్కెట్‌లోకి అక్రమంగా నిధులను తరలించిన ఆరోపణలు దీనిపై ఉన్నాయి. కార్మెల్ ఏషియాలో పెట్టుబడు లు పెట్టిన వారే జగతిలోనూ పెట్టారు. వీటిలో జీఆర్ ఇంట్రాకెమ్, పయనీర్ ఇన్ ఫ్రా, ఇండి యా సిమెంట్స్ ఉన్నాయు. ఇండియా సిమెంట్స్ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు లబ్ధిపొందింది.
అంతా మాయా ప్రపంచం
జగన్ వ్యాపార సామ్రాజ్యమంతా ఓ మాయా ప్రపంచం. సండూర్ పవర్ కంపెనీ మొత్తం 4 అనుబంధ కంపెనీలను ప్రమోట్ చేసింది. ఇవి క్లాసిక్ రియాల్టీ, కార్మెల్ ఏషియా, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, హరీశ్ ఇన్‌ఫ్రా. ఈ కంపెనీల్లో క్లాసిక్ రియాల్టీకి మరో 3 అనుబంధ కంపెనీలుగా సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్‌ఫ్రా, కాప్‌స్టోన్ ఇన్ ఫ్రా తోడయ్యాయి. కార్మెల్ అనుబంధ సంస్థల్లో జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్‌తో పాటు జనని ఇన్‌ఫ్రా ఉంది. సిలికాన్ బిల్డర్స్ అనుబంధ సంస్థల్లో షలోమ్ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్ హోటల్స్ ఉన్నాయి.