Share News

మూడు తరాలకు సరిపడా అప్పు!

ABN , Publish Date - Apr 09 , 2024 | 04:50 AM

రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా దుర్మార్గుడైన ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దింపడానికే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని

మూడు తరాలకు సరిపడా అప్పు!

ఒక్కొక్క తలపై రూ.2 లక్షల భారం

దుర్మార్గపు జగన్‌ను గద్దె దించడానికే కూటమి: పురందేశ్వరి

కొవ్వూరు, ఏప్రిల్‌ 8: రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా దుర్మార్గుడైన ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దింపడానికే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టిపెడితే రూ.12.5 లక్షల కోట్లు అప్పు ఉంది. మూడు తరాలకు సరిపడా అప్పు ఇది. ప్రతి ఒక్కరి తల మీద రూ.2 లక్షలు అప్పు భారం ఉంది. దీనిని ఎవరు భరించాలి? ఏది కనబడితే అది తనఖా పెట్టి అప్పు తీసుకువచ్చి ఆ భారాన్ని ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్‌ మనపై పెడతున్నారు. చివరకు సచివాలయం కూడా తనఖా పెట్టి రూ.350 కోట్లు అప్పు తెచ్చారంటే దీనిని మనం క్షమించగలమా? అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? తలలేని మొండెం లాగా రాజధాని లేని రాష్ట్రంలా చేసిన ఘనత జగన్మోహన్‌రెడ్డిది కదా? దుర్మార్గుడైన జగన్‌ను గద్దె దించాలంటే ఈ కూటమి అనివార్యం అని భావించి ఒక్కటయ్యాం’’ అని పురందేశ్వరి అన్నారు.

Updated Date - Apr 09 , 2024 | 04:50 AM