Share News

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించండి

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:01 AM

కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, వరిగలు, జొన్నలు, సజ్జ వంటి చిరుధాన్యాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించండి
చిరుధాన్యాల స్టాల్స్‌ను తిలకిస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, వరిగలు, జొన్నలు, సజ్జ వంటి చిరుధాన్యాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. సోమవార ం కలెక్టరేట్‌ ప్రాంగణంలో చిరుధాన్యాల ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, ఆకు కూరలు స్టాళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను సేవించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిరుధాన్యాలు సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు వినియోగించేలా రైతులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి విత్తనాలతో పండించిన బ్లాక్‌రైస్‌, రెడ్‌రైస్‌, చిట్టి ము త్యాలు, కొజ్జా పటాలియా, మైసూర్‌ మల్లిక తదతర దేశవాళి విత్తనాలను ఆమె పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యానిచ్చే చిరుధాన్యాలు, సేంద్రియ ఆహార ఉత్పత్తులను గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు తీసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనం

ఇండియన రెడ్‌క్రా్‌ససొసైటీ, ఓంకారం కాశిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్‌, రెడ్‌క్రా్‌సచైర్మన రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ ప్రాంగణంలో ఫిర్యాదుదారులకు మధ్యాహ్నభోజన పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి జిల్లాలోని సుదూర ప్రాంతాలనుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను విన్నవిస్తుంటారని.. ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీజీఆర్‌ఎస్‌ ప్రాంగణంలో షెడ్‌ వేయుంచడంతో పాటు ప్రశాంతంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే మంచినీరుతో పాటు రెడ్‌క్రాస్‌, కాశిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో అర్జీదారులకు మద్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వయంగా పాల్గొని అర్జీదారులకు ఆహార పదార్దాలు వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రా్‌సప్రధాన కార్యదర్శి డిస్టిక్‌ కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ వెంకటసుబ్బయ్య, తదితర అధికారులు, రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 12:01 AM