Share News

సర్పంచులకు తెలియకుండానే ఉపాధి పనులు

ABN , Publish Date - May 31 , 2024 | 12:01 AM

గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులు సర్పంచుల దృష్టికి తేవడం లేదని, ఎక్కడ పనులు చేస్తున్నారో కూడా తెలియడం లేదని జొన్నగిరి, కడమకుంట్ల సర్పంచులు ఓబులేసు, మస్తాన్‌బీ అన్నారు.

సర్పంచులకు తెలియకుండానే ఉపాధి పనులు

అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్పంచుల అసంతృప్తి

తుగ్గలి, మే 30: గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులు సర్పంచుల దృష్టికి తేవడం లేదని, ఎక్కడ పనులు చేస్తున్నారో కూడా తెలియడం లేదని జొన్నగిరి, కడమకుంట్ల సర్పంచులు ఓబులేసు, మస్తాన్‌బీ అన్నారు. గ్రామ సభకు తెలియకుండానే ఉపాధి పనులు నిర్వహిస్తూ కూలీలకు అన్యాయం చేస్తున్నారంటూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఇన్‌చార్జి ఎంపీపీ మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల నివేదికలను, వివరాలను అధికారులు చదివి వినిపించారు. సమావేశానికి హాజరైన జొన్నగిరి, కడమకుంట్ల సర్పంచులు ఓబులేసు, మస్తాన్‌బీ మాట్లాడుతూ మండలంలో కొన్ని శాఖల అధికారులు సమస్యలపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి పనుల గురించి ఎందుకు సమాచారం తెలపడం లేదని నిలదీశారు. మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా నిర్వహించి 45 నిమిషాలపాటు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు. సమావేశంలో ఎంపీడీవో విజయలక్ష్మి, వైద్యులు ప్రవీణ్‌ కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు, ఈవోఆర్‌డీ గోపాల్‌, వైస్‌ ఎంపీపీ ఎల్లనాగప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 12:01 AM