శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , Publish Date - Mar 27 , 2024 | 02:19 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు.
తిరుమల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హృషికేశ్ రాయ్,మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ ఉన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినీ నటుడు రామ్‌చరణ్, హీరో కృష్ణ కుమార్తెలు గల్లా పద్మావతి, ప్రియదర్శిని కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.