Share News

దివ్యాంగులు, కొవిడ్‌ బాధితులకు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనే అత్యవసర సిబ్బంది, జర్నలిస్టులకు అవకాశం

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:01 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ను ఏ కేటగిరికి చెందిన వారు ఎక్కడ ఉపయోగించుకోవాలి? దాని వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? దీనిపై ఎన్నికల సంఘం వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది.

దివ్యాంగులు, కొవిడ్‌ బాధితులకు కూడా   ఎన్నికల విధుల్లో పాల్గొనే అత్యవసర సిబ్బంది,   జర్నలిస్టులకు అవకాశం

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంలో

పొరపాటు చేస్తే గల్లంతే

పోస్టల్‌ బ్యాలెట్‌ను ఏ కేటగిరికి చెందిన వారు ఎక్కడ ఉపయోగించుకోవాలి? దాని వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? దీనిపై ఎన్నికల సంఘం వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది.

- అమరావతి,ఆంధ్రజ్యోతి

  • ఎవరు ఎక్కడ ఓటు వేయాలి?

  • సర్వీస్‌ ఓటర్లు... ఎలకా్ట్రనిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలి.

  • ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు... రిటర్నింగ్‌ అధికారి నిర్దేశించిన తేదీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటర్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలి.

  • దివ్యాంగులు (ఏవీపీడీ), 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు (ఏవీఎ్‌ససీ), ప్రస్తుతం కొవిడ్‌ బాధితులుగా ఉన్న ఓటర్లు (ఏవీసీఓ)... రిటర్నింగ్‌ అధికారి ఏర్పాటు చేసిన పోలింగ్‌ సిబ్బంది సహకారంతో ఓటరు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

  • అత్యవసర సేవలుగా గుర్తించబడిన ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉండి... ఈసీ గుర్తింపు కార్డును పొందిన పాత్రికేయులు (ఏవీఈఎస్‌)... రిటర్నింగ్‌ అధికారి నిర్దేశించిన తేదీల్లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ ఓటింగ్‌ సెంటర్‌లో వినియోగించుకోవాలి.


వయోవృద్ధులకు

ఇంటి నుంచే

  • తెలుసుకోవాల్సిన విషయాలు... తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

1. మీ ఓటు ఉన్న పోలింగ్‌ స్టేషన్‌, పార్ట్‌ నంబరు, ఓటర్ల జాబితాలో మీ ఓటు క్రమసంఖ్య తెల్సుకోవాలి. ఎపిక్‌ కార్డు లేదా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న ఏదైనా ఇతర గుర్తింపు పత్రం, తన ఎన్నికల విధుల నియామక పత్రం తీసుకొని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లాలి.

2. ప్రతి ఓటరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ పేపరుతో పాటు కొన్ని ఫారాలు, కొన్ని కవర్లు ఇస్తారు. అసెంబ్లీ బ్యాలెట్‌ పేపరు, కవర్లు 13 బీ, 13 సీ... పింక్‌ కలర్‌లో ఉంటాయి. లోక్‌సభ బ్యాలెట్‌ పేపరు తెలుపు రంగులోను, కవర్లు 13 బీ, 13 సీ గ్రీన్‌ రంగులో ఉంటాయి.


  • ఓటు

3. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగంలో ఉండేవి ఇవే...

ఏ. ఫార్మ్‌ 13 ఏ - డిక్లరేషన్‌

బీ. ఫార్మ్‌ 13 బీ - కవర్‌ ఏ(చిన్నది... లోపల కవర్‌)

సీ. ఫార్మ్‌ 13 సీ - కవర్‌ బీ(పెద్దది... బయట కవర్‌)

డీ. ఫార్మ్‌ 13 డీ - ఓటరుకి సూచనలు.

4. ఓటింగ్‌ కంపార్ట్మ్‌ంట్‌లోకి వెళ్లి, బ్యాలెట్‌ పేపరు మీద ఓటును మీకు నచ్చిన అభ్యర్థికి క్రాస్‌ మార్క్‌, లేదా టిక్‌ రూపంలో నమోదు చేయాలి.

5. బ్యాలెట్‌ పేపరు మీద ఎట్టి పరిస్థితుల్లో సంతకం చేయకూడదు.

ఓటరు గుర్తింపు తెలిపే ఏ విధమైన గుర్తులు రాయకూడదు.

6. ఫార్మ్‌ 13 ఏ - డిక్లరేషన్‌లో మీ బ్యాలెట్‌ పేపర్‌ సీరియల్‌ నంబరును వేయడం, సంతకం చేయడం తప్పనిసరి.

7. ఓటరు గుర్తింపును, ఫార్మ్‌ 13 ఏలో గెజిటెడ్‌ అధికారి(ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద అందుబాటులో ఉంటారు) తప్పనిసరిగా ధృవీకరించాల్సి ఉంటుంది.

8. ఓటు నమోదు చేసిన బ్యాలెట్‌ పేపర్‌ను ఫార్మ్‌ 13 బీ అంటే కవర్‌

ఏ లేదా లోపలి కవర్‌లో పెట్టి సీల్‌ వేయాలి.

9. దానిపై మీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి చిరుమామా రాయాలి.

తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ సీరియల్‌ నంబరు వేయాలి.

10. ఈ లోపలి కవర్‌లో బ్యాలెట్‌ పేపర్‌ తప్ప మరి ఏ ఇతర డాక్యుమెంట్లు ఉండరాదు.

11. సీల్‌ చేసి సిద్ధం చేసిన కవర్‌ను, మీ డిక్లరేషన్‌ ఫార్మ్‌ను విడివిడిగా ఫార్మ్‌ 13-సీ అనగా కవర్‌ బీ (బయట కవర్‌)లో పెట్టి సీల్‌ చేసి సంబంధిత రిటర్నింగ్‌ అధికారి చిరునామా పూర్తి చేయాలి.

12. ఈ కవర్‌పై ఓటరు తప్పనిసరిగా సంతకం చేసి, అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయాలి.

Updated Date - Apr 29 , 2024 | 05:01 AM