Share News

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:27 AM

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సృజన అన్నారు.

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి

అధికారులకు కలెక్టర్‌ డాక్టర్‌ సృజన ఆదేశం

ఆలూరు, ఏప్రిల్‌ 2: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సృజన అన్నారు. మంగళవారం ఆలూరు అర్‌డీటీ భవన్‌లో ఎన్నికల నిర్వహణపై ఆలూరు నియోజకవర్గ స్థాయి క్లస్టర్‌, అధికారులు, బూత్‌ లెవెల్‌ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఓటు అవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మోడల్‌ కోడ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఎప్పట్టికప్పుడు అభ్యర్థులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామునాయక్‌, అన్ని మండలాల తహసీల్దార్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:27 AM