Share News

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:08 AM

ఎన్నికల నిబంధనలు అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని ఆర్వో చిరంజీవి తెలిపారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఎమ్మిగనూరు రూరల్‌, మార్చి 23: ఎన్నికల నిబంధనలు అన్ని రాజకీయ పార్టీలు పాటించాలని ఆర్వో చిరంజీవి తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శేషారెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది వలంటీర్లను, ఒక సొసైటి ఉద్యోగిని విధుల నుంచి తొలగించామన్నారు. మొత్తం 272 పోలింగ్‌ కేంద్రాల్లో 8 కేంద్రాలను మరొకచోటికి మార్చేందుకుగాను, 18 కేంద్రాల పేర్లను మార్చిందుకు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. ఎక్కడైనా పార్టీల జెండాలు, పార్టీల నాయకులు ఫ్లెక్సీలు, కరపత్రాలు అతికించి ఉంటే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌ 08512-297300కు ఫోన్‌ చేసిగాని, సీ విజిల్‌ ద్వారా కూడా చెప్పవచ్చని తెలిపారు. కన్వెన్షన్‌ హాల్‌లో శిక్షణా తరగతులు ఉంటాయన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:08 AM