Share News

election సంబరాలకు నో

ABN , Publish Date - May 23 , 2024 | 11:44 PM

తిరునాళ్లు.. జాతర అంటే సంబరం అంతా ఇంతా కాదు. అయితే ఈసారి అంతజోష్‌ ఉండదు. కేవలం స్వామికి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని రావాల్సిందే. ఇక ఎన్నికల గెలుపోటముల అనంతరం టపాసుల శబ్దం రాకూడదు. సంబరాలకు పోలీసులు నో చెప్పేశారు. తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లు, జిల్లాలో అక్కడక్కడ జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులను ఈ నిర్ణయం తీసుకున్నారు.

election సంబరాలకు నో
టపాసుల గౌడోనను పరిశీలిస్తున్న సీఐ కొండారెడ్డి

తిరునాళ్లకు బ్రేక్‌... బాణసంచాపై నిషేధం

ఎన్నికల నేపథ్యంలో పోలీసుల చర్యలు

అనంతపురం క్రైం, మే 23: తిరునాళ్లు.. జాతర అంటే సంబరం అంతా ఇంతా కాదు. అయితే ఈసారి అంతజోష్‌ ఉండదు. కేవలం స్వామికి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని రావాల్సిందే. ఇక ఎన్నికల గెలుపోటముల అనంతరం టపాసుల శబ్దం రాకూడదు. సంబరాలకు పోలీసులు నో చెప్పేశారు. తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లు, జిల్లాలో అక్కడక్కడ జరిగిన సంఘటనల నేపథ్యంలో పోలీసులను ఈ నిర్ణయం తీసుకున్నారు. పెన్నహోబిళం తిరునాళ్ల మామూలుగానే జరిగిపోతోంది. అయితే వివాదాస్పద ప్రాంతాలు, నియోజకవరాల్లో నిర్వహించే తిరునాళ్లు, జాతర్లకు నో చెప్పేశారు. పెద్దవడుగూరు మండలం రామరాజుపల్లి, కాశేపల్లి, గుత్తి అనంతపురంలలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో పున్నమి రోజున బండి శూల తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాలకు పోలీసులు వద్దని చెప్పేశారు. అధికారులు గ్రామ పెద్దలతో చర్చించినా విఫలమయ్యాయి. ఎన్నికల అనంతరం అని చెప్పినా అప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారో..? వారితో మరో పార్టీ వారు కయ్యానికి దువ్వడం లాంటి ఘటనలు జరుగుతాయని పోలీసులు నో చెప్పేశారు. కావాలంటే ఆలయంలో సింపుల్‌గా వెళ్లి పూజలు చేసుకోవచ్చని సలహా ఇచ్చారట.

టపాసుల వాడకంపై నిషేధం: కలెక్టర్‌

అనంతపురం క్రైం/ టౌన: ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పేలుడు చట్టం 1884లోని సెక్షన 6(ఏ) మేరకు జూన 6వతేదీ వరకు టపాసుల వాడకంపై నిషేధం విధించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టపాసుల తయారీ, అమ్మకాలు, కొనుగోలు, వినియోగం చేయకూడదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల మద్దతుదారులు విజయోత్సవాలు నిర్వహించే సమయంలో టపాసులు వినియోగించరాదన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

అక్రమంగా నిల్వచేసిన టపాసులు సీజ్‌

పుట్టపర్తి రూరల్‌: ఎనుమలపల్లిలో అక్రమంగా నిల్వచేసిన టపాసులను సీజ్‌ చేసి కేసు నమోదుచేసినట్లు అర్బన సీఐ కొండారెడ్డి తెలిపారు. తనిఖీల్లో భాగంగా గురువారం ఎనుమలపల్లి శిల్పారామం వెనుకభాగంలోని గోవర్థనరెడ్డికి చెందిన వ్యవసాయ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 45వేల విలువచేసే టపాసులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:44 PM