Share News

వేసవి నాటికి ఎల్‌నినో బలహీనం

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:16 AM

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దుర్భిక్షం, వడగాడ్పులు, విపత్తులకు కారణమైన ఎల్‌నినో ఈ వేసవి నాటికి బలహీనపడనుంది.

వేసవి నాటికి ఎల్‌నినో బలహీనం

విశాఖపట్నం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దుర్భిక్షం, వడగాడ్పులు, విపత్తులకు కారణమైన ఎల్‌నినో ఈ వేసవి నాటికి బలహీనపడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత ఎల్‌నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి దేశంలో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం బులెటిన్‌ విడుదల చేసింది. ఈ నెలలో దేశంలో చలి తగ్గుతుందని.. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది. ఏపీ, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్‌, గుజరాత్‌ మినహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ నెలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ఇంకా దక్షిణాదిలో తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదు కానుందని తెలిపింది.

Updated Date - Feb 01 , 2024 | 08:31 AM