Share News

‘విద్యాకానుక’ వాయిదా

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:53 AM

బడులు తెరిచే రోజునే విద్యాకానుక పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది.

‘విద్యాకానుక’ వాయిదా

12నే పంపిణీ అని గతంలో ప్రకటన.. ప్రభుత్వ మార్పుతో తాజా నిర్ణయం

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): బడులు తెరిచే రోజునే విద్యాకానుక పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వం మారినందున కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కిట్లు పంపిణీ చేసే అవకాశం కనిపిస్తోంది. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ ప్రక్రియను చేపడతారు. ఈ నెల 12న బడులు పునఃప్రారంభం అవుతాయి. అదే రోజున విద్యార్థులు కానుక పంపిణీ చేస్తామని ఫలితాలకు ముందు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ప్రకటించారు. ఈ మేరకు మండల స్టాక్‌ పాయింట్లకు విద్యా కానుక కిట్లు సరఫరా చేసేందుకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారుతున్నందున కొన్నిరోజుల తర్వాత పంపిణీ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రతిఏటా బడులు తెరిచిన రోజునే విద్యా కానుక విద్యార్థులకు అందడం లేదు. దాదాపు 2నెలల పాటు ఈ కిట్ల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. మొదటిరోజే ఇవ్వడం అసాధ్యమని తెలిసినా ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ రోజే అందరికీ ఇచ్చేస్తామంటూ హడావిడి చేశారు. అయితే ఇప్పటికీ సగం కిట్లు కూడా స్టాక్‌ పాయింట్లకు చేరలేదు.

Updated Date - Jun 06 , 2024 | 07:55 AM