మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:15 AM
విశాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు ఆదివారం ముగిశాయి.
కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు స్వాధీనం
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు ఆదివారం ముగిశాయి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంతోపాటు ఆయన స్నేహితుడు, ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ) నివాసం, కార్యాలయంలో ఈడీ అధికారులు శనివారం ఉదయం సోదాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏకకాలంలో ఐదు చోట్ల జరిగిన తనిఖీలు ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల వరకు ఏకధాటిగా కొనసాగాయి. ఈ సందర్భంగా మనీలాండరింగ్‌కు సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని తీసుకెళ్లినట్లు తెలిసింది.