Share News

డ్వాక్రా మహిళలకు తాయిలాలు

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:10 AM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు బరితెగించారు. ఓటర్లకు బాహాటంగానే తాయిలాలు పంచుతూ వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు

డ్వాక్రా మహిళలకు తాయిలాలు

500 మందికి చీరలు పంచిన ఎమ్మెల్సీ దువ్వాడ

పిడుగురాళ్లలో ఎమ్మెల్యే కాసు చేతుల మీదుగా పాస్టర్లు, సేవకురాళ్లకు నూతన వస్త్రాల పంపిణీ

టెక్కలి/పిడుగురాళ్ల, మార్చి 8: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు బరితెగించారు. ఓటర్లకు బాహాటంగానే తాయిలాలు పంచుతూ వైసీపీని గెలిపించాలని కోరుతున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని తన కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నియోజకవర్గ మహిళా ప్ర జా ప్రతినిధుల సన్మానం పేరిట 500 మంది డ్వాక్రా మహిళలకు చీరలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్‌, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు పాల్గొన్నారు. అలాగే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురువారం రాత్రి గురజాల నియోజకవర్గ పాస్టర్ల కుటుంబసభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాస్టర్లు, సేవకురాళ్లకు ఎమ్మెల్యే కాసు మహే్‌షరెడ్డి, స్థానిక వైసీపీ నేతలు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

Updated Date - Mar 09 , 2024 | 07:55 AM