Share News

డ్వాక్రా రుణాల మంజూరుకు కమీషన్లు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:44 PM

డ్వాక్రా రుణాల మంజూరులో యానిమేటర్లు 10శాతం కమీషను తీసుకుంటున్నారని ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు ధ్వజం... డ్వాక్రా నిధులు స్వాహా చేయ డంతో సస్పెండ్‌ చేసిన గూడాల యానిమేటర్‌ను తిరిగి విధుల్లోకి ఎలాతీసుకున్నారని అధికారులపై సర్పంచ్‌ మండిపాటు....నీటిఎద్దడి, ఇతర సమస్యలపై సభ్యుల ఆగ్రహం.... వె రసి అల్లవరం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది.

డ్వాక్రా రుణాల మంజూరుకు కమీషన్లు

యానిమేటర్‌కు నిధులు ఇవ్వడంపై ఆగ్రహం

వాడివేడిగా అల్లవరం మండల సమావేశం

అల్లవరం, ఫిబ్రవరి 20: డ్వాక్రా రుణాల మంజూరులో యానిమేటర్లు 10శాతం కమీషను తీసుకుంటున్నారని ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు ధ్వజం... డ్వాక్రా నిధులు స్వాహా చేయ డంతో సస్పెండ్‌ చేసిన గూడాల యానిమేటర్‌ను తిరిగి విధుల్లోకి ఎలాతీసుకున్నారని అధికారులపై సర్పంచ్‌ మండిపాటు....నీటిఎద్దడి, ఇతర సమస్యలపై సభ్యుల ఆగ్రహం.... వె రసి అల్లవరం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. ఎంపీపీ ఇళ్ళ శేషగిరిరావు అధ్యక్షతన మంళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. డ్వాక్రా రుణాలకు యానిమేటర్లు లక్షకు రూ.1,000 వంతున లంచాలు తీససుకుంటున్నారని సర్పంచ్‌ రాకాపు విజయలక్ష్మితో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆరోపించారు. గుండెపూడిలో యానిమేటర్‌ నిధులు స్వాహా చేసినా పట్టించుకోలేదని ఎంపీటీసీ మాకే కృష్ణమూర్తి ఆరోపించారు. గుడాల యానిమేటర్‌ గోసంగి వెంకటరమణ రూ.5.45లక్షలు స్వాహా చేయగా డీపీఎం, ఏపీఎంలు విచారణచేసి సస్పెండ్‌ చేశార న్నారు. ఆమెను విధుల్లోకి ఎందుకు తీసుకున్నారని ఏపీఎం సయ్యద్‌పై సర్పంచ్‌ దాకారపు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు దోచేసిన ఆమెను విధుల్లోకి తీసుకుంటే ఆం దోళన కొనసాగిస్తానని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్ర యిస్తానని ఏపీఎంను హెచ్చరించారు. ఆయనకు మండల సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకట్రావు మద్దతు తెలపగా యానిమేటర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీపీ కోరారు. ఆ యానిమేటర్‌ విషయంలో తనను బెదిరిస్తున్నారని, ఇంకా రూ.3.44 లక్షలు బకాయి ఇంకా ఉందని ఏపీఎం సయ్యద్‌ వివరించా రు. కొమరగిరిపట్నం జాంబవన్‌పేట స్కూలును చర్చిలో నడుపుతున్నారని సర్పంచ్‌ రాకాపు విజయలక్ష్మి ఆరోపి ంచా రు. కోడూరుపాడు సీతారామపేటలో అద్దెఇంట్లో పాఠశాల నడుపుతున్నారని ఎంపీటీసీ రంగానాథస్వామి అన్నారు. మొ గళ్ళమూరు మెయిన్‌రోడ్డులోని పాఠశాలను విద్యార్థులు లేక మూసివేశామని ఎంఈవో కె.కిరణ్‌బాబు తెలిపారు. గుండెపూడి వాటర్‌ ప్రాజెక్టు గట్టు దిగజారి ఇబ్బందిగా మా రినందున ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు శ్రద్ధచూపాలని ఎంపీపీ సూచించారు. తుమ్మలపల్లి శివారు తాళ్ళచెరువులో కుళాయినీటిలో పురుగులు వస్తున్నాయని ఎంపీటీసీ పి.రాజేశ్వరి ఆరోపించారు. గూడాల, తాడికోన, యెంట్రుకోన పంట కాలువలకు సాగునీరు అందట్లేదని సర్పంచ్‌లు సాధనాల వెంకట్రావు, దాకారపు చిరంజీవి, తిక్కిరెడ్డి శ్రీనివాసులు ఆరోపించారు. మండలంలోని పలు సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జడ్పీటీసీ కొనుకు గౌత మి, ఏఎంసీ చైర్మన్‌ దంగేటి డోలామణి, ఎంపీడీవో కృష్ణమోహన్‌, వైస్‌ ఎంపీపీ వడ్డి గంగ, డాక్టర్‌ వై.బాలసుబ్రహ్మణ్యం, ఏఈ జి.స్వామి, రెహమాన్‌, కె.సునీత, ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్ర్తీనిధి కట్టిన సొమ్ములు ఏమయ్యాయి..!

కట్టిన సొమ్ములకు రశీదులు లేవని పొదుపు సొమ్ము నుంచి జమ

అంబాజీపేట, ఫిబ్రవరి 20: కుటుంబ అవసరాల కోసం తీసుకున్న సొమ్ము కొంతమొత్తంలో చెల్లించినప్పటికీ బ్యాంకు రశీదులు పూర్తిస్థాయిలో లేవని తమ పొదుపు సొమ్ము నుండి లక్షలరూపాయలు తీసుకోవడంపై అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన ఆశ్వని డ్వాక్రా సంఘ సభ్యులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. అశ్వని గ్రూపునకు చెందిన ఐదుగురు మహిళలు స్ర్తీనిధి ద్వారా రూ. 2,50,000 సొమ్మును తీసుకున్నారు. ఈ సొమ్మును సంఘ సభ్యురాలైన పులిదిండి ఝాన్సీ, ఆమె కుటుంబ సభ్యులకు అం దించారు. ఈ సొమ్మును దాదాపు రూ. 1,81,500 వరకూ చెల్లించారు. అయినప్పటికీ బ్యాంకు రశీదులు లేవని ఆ గ్రూపు సభ్యుల పొదుపు ద్వారా రూ.1,44,000 తమకు తెలియకుండా అధికారులు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్ర్తీనిధి సొమ్మును రూపాయి వడ్డీకి ఇస్తామని చెప్పి ఇప్పుడు అధిక మొత్తంలో సొమ్ములు రికవరీ చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. దీనిపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని సంఘ సభ్యులు పులిదిండి మంగాదేవి, నెల్లి పద్మలు కోరుతున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:44 PM