ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా డాక్టర్ నరసింహం
ABN , Publish Date - Jul 12 , 2024 | 03:27 AM
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉప కులపతిగా డాక్టర్ దొమ్మేటి ఎస్‌వీఎల్ నరసింహం నియమితులయ్యారు.
విజయవాడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉప కులపతిగా డాక్టర్ దొమ్మేటి ఎస్‌వీఎల్ నరసింహం నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈయన వైద్య విద్య సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. కాకినాడకు చెందిన నరసింహం అక్కడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, ఇన్‌ఛార్జి డీఎంఈగా పనిచేస్తున్నారు.