Share News

గ్రీన్‌కో సోలార్‌ కంపెనీకి భూములు ఇవ్వం

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:47 AM

గ్రీన్‌కో సోలార్‌కు భూముల ఇచ్చేది లేదని పాతపాడు, మీరాపురం రైతులు తేల్చిచెప్పారు.

గ్రీన్‌కో సోలార్‌ కంపెనీకి భూములు ఇవ్వం

పాతపాడు, మీరాపురం రైతులు

నంద్యాల (కల్చరల్‌), జనవరి 10: గ్రీన్‌కో సోలార్‌కు భూముల ఇచ్చేది లేదని పాతపాడు, మీరాపురం రైతులు తేల్చిచెప్పారు. ఈ మేరకు బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లో రెండు పంటలు పండుతాయని, బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నాయని తమ భూములను సోలార్‌ కంపెనీకి ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తెలిపారు. బనగానపల్లె మండలంలోని పాతపాడు,యాగంటి దేవస్థానాల మధ్య గ్రీన్‌కోలార్‌ కంపెనీ ప్లాంటును ఏర్పాటు చేస్తుందన్నారు. కటికవానికుంట, పసుపుల గ్రామాలలో 1000 మొగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కంపెనీ పాతపాడు, మీరాపురం గ్రామాలకు చెందిన 200 ఎకరాల్లో సోలార్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలనుకుంటోందని, దానికిగాను సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. పొలాలను ఇస్తే జీవనోపాధికోల్పాతమని రైతులు జేసీకి విన్నవించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వీటిని పరిశీలించేందుకు డోన్‌ ఆర్డీఓకు పంపామని ఆర్డీఓ సర్వే నిర్వహించి నివేదిక ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో పాతపాడు,మీరాపురం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:47 AM