Share News

నీ సేవలకు సలాం.. శాండీ..

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:50 PM

పోలీసు శాఖకు ఎనలేని సేవలు చేసిన జాగిలం శాండీ ఉద్యోగ విరమణను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి పరిధిలోని శిరసాని పోలీసు పరేడ్‌ మైదానంలో శాండీని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, సిబ్బంది... పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు.

నీ సేవలకు సలాం.. శాండీ..
శాండీకి బహుమతి అందజేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

పోలీసు శాఖకు ఎనలేని సేవలు చేసిన జాగిలం శాండీ ఉద్యోగ విరమణను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి పరిధిలోని శిరసాని పోలీసు పరేడ్‌ మైదానంలో శాండీని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, సిబ్బంది... పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. 2012లో జన్మించిన శాండీ 2013లో హ్యండ్లర్‌ చెన్నప్పతో కలిసి హైదారాబాద్‌లోని మొయినాబాద్‌లో బాంబుల గుర్తింపులో 10 నెలలు శిక్షణ పొందిందన్నారు. వీవీఐపీల సేవలకు వినియోగించామన్నారు. 2015లో గోదావరి పుస్కరాల్లో సమర్థవంతమైన సేవలతో ప్రశంసలు పొందిందన్నారు. గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల్లో శాండీ విధులను డెమోరూపంలో అధికారుల ముందు ప్రదర్శించి, పలు అవార్డులు, రివార్డులు సాధించిందన్నారు. విభజన సమయంలో శాండీని జిల్లాకు కేటాయించారన్నారు. సమర్థవంతమైన సేవలతో జిల్లాకు మంచిపేరు తీసుకు వచ్చిందని ఎస్పీ కొనియాడారు. శాండీ సేవలు 11 సంవత్సరాలు ముగియడంతో పరేడ్‌ మైదానంలో ఎస్పీ ఘనంగా సన్మానించి, ప్రశంసాపత్రం అందజేశారు. శాండీని పోలీసు సంరక్షణలో బాగా చూసుకోవాలని హ్యాండ్లర్‌ ఏఆర్‌ పీసీ చెన్నప్పను ఎస్పీ ఆదేశించారు

-పుట్టపర్తి రూరల్‌

Updated Date - Jul 05 , 2024 | 11:50 PM