Share News

కుటుంబ వివాదాల పరిష్కారానికి 20 ఏళ్లు అవసరమా?

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:58 AM

అన్నదమ్ములు, భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి 20 ఏళ్లు అవసరమా అన్నది న్యాయవాదులు ఆలోచించాలని, మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ సూచించారు.

కుటుంబ వివాదాల పరిష్కారానికి 20 ఏళ్లు అవసరమా?

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ

విజయనగరం(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 25: అన్నదమ్ములు, భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి 20 ఏళ్లు అవసరమా అన్నది న్యాయవాదులు ఆలోచించాలని, మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ సూచించారు. న్యాయస్థానాలను ఆశ్రయించినవారు ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురుచూసే అవసరం లేకుండా చూడాలన్నారు. రెండో రోజు విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం విజయనగరంలో జిల్లా కోర్డు కాంప్లెక్స్‌ నూతన భవన సముదాయ నిర్మాణానికి ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతీయువకులు జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ చేసేలా వారిని సీనియర్‌ న్యాయవాదులు ప్రోత్సాహించాలన్నారు. జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ప్రజలు న్యాయవ్యవస్థపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయవాదులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌, రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 08:37 AM