వైద్యాధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:59 PM
doctors: వైద్యాధికారులు గ్రామా ల్లో బాధ్యతగా పని చేయాలని కలెక్టరు అంబేడ్కర్ కోరారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్యాధికారులతో సమీక్షిం చారు.

విజయనగరం కలెక్టరేట్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వైద్యాధికారులు గ్రామా ల్లో బాధ్యతగా పని చేయాలని కలెక్టరు అంబేడ్కర్ కోరారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్యాధికారులతో సమీక్షిం చారు.ఈసందర్భంగా మాట్లాడుతూ మూడు నెలలుగా పీడిస్తున్న డయేరియాపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, క్లోరినేషన్, ఆరోగ్యపరిస్థితులపై దృష్టి పెట్టాలని తెలిపారు. గుర్లలో డయేరియా అనంతరం జిల్లాలో డ్రైనేజీల్లో గల పైపు లైన్లు బయిటకు తీసినట్లు చెప్పారు. ప్రసుత్తం నీటి కాలుష్యం లేదని, ఇంకోసారి డయేరియాకు నీటి కాలుష్యం కారణమని వినపకూడదన్నారు. ప్రజలు వ్యాధులు బారిన పడకుండా చూసే బాధ్యత వైద్యాధికారులదేనని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాణి, డీసీ హెచ్‌ఎస్ రాజ్యలక్ష్మి, జిజీహెచ్, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
3న గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు
జిల్లాలో జనవరి మూడో తేదీన 3,857 గృహ ప్రవేశాలను నిర్వహించనున్నట్లు కలెక్ట రు అంబేద్కర్ వెల్లడించారు. ఈమేరకు శనివారం గృహ నిర్మాణ శాఖ అధికారులుతో వీడియోకాన్ఫర్సెన్ నిర్వహించారు.గృహ ప్రవేశాలకు పూర్తయిన ఇళ్లకు సంబందించిన చిన్న చిన్న పనులు ఏవైనా మిగిలిఉంటే వెంటనే వాటిని పూర్తిచేసి వసతులతో ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు.