Share News

సభ్యత్వం కావాలా.. సొమ్ము కట్టు! లేదా.. తక్కువ కిరాయికి లారీ పెట్టు

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:15 AM

నార్త్‌ ఈస్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌’ పేరుతో వైసీపీ నేత సాగిస్తున్న దందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.

సభ్యత్వం కావాలా.. సొమ్ము కట్టు! లేదా.. తక్కువ కిరాయికి లారీ పెట్టు

కనీసం 10 ట్రిప్పులైనా రవాణా చేసిపెట్టు

లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌లో వైసీపీ నేత దందా

గుంటూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ‘నార్త్‌ ఈస్ట్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌’ పేరుతో వైసీపీ నేత సాగిస్తున్న దందాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు పంపాలంటే ఎవరైనా సరే వీరిని ఆశ్రయించాల్సిన పరిస్థితిని కల్పించారు. తాజాగా అసోసియేషన్‌ సభ్యత్వం పేరుతో లారీ ఓనర్స్‌ వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఎవరైనా కొత్త లారీ కొనుగోలు చేసి అసోసియేషన్‌లో సభ్యత్వం కోసం అర్జీ పెట్టుకుంటే సభ్యత్వాన్ని వెంటనే ఇవ్వరు. పలు రకాల షరతులు పెడతారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు అతి తక్కువ ధరలకు కనీసం 10 ట్రిప్పులు చేయాలని చెబుతారు. ఒక లారీ దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వారు చెప్పినన్ని ట్రిప్పులు వేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. అంత జరిగినా చివరికి సభ్యత్వ రుసుం అంటూ రూ.30 వే లు చెల్లించాల్సిందేనని పట్టుబడతారు. ఇవేమీ లేకుండా సభ్యత్వం కావాలంటే రూ. 70 వేలు అనధికారికంగా వసూలు చేస్తారు. అవి వారి జేబుల్లోకే వెళతాయి. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ తొలి నుంచి వివాదాల మధ్యనే కొనసాగుతోంది. మొదట్లో నల్లచెరువులో ఈ అసోసియేషన్‌ ఉండేది. ఆ రోజుల్లోనే లారీకి రూ.30 వేలు చొప్పున వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారడంతో అసోసియేషన్‌ని ఆటోనగర్‌కు తరలించారు. దాదాపుగా 4 ఎకరాలకు పైగా స్థలాన్ని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌కి కేటాయించారు. అసోసియేషన్‌లో గుత్తాధిపత్యం కోసం ఒక నాయకుడి హత్య కూడా జరిగింది. మొదట్లో 150 మంది లారీ ఓనర్లే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా 650కి చేరింది. దాదాపు పదిహేనేళ్లుగా వైసీపీ నేత ఒకరు ప్రెసిడెంట్‌గా ఉంటూ నియంతలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. లారీ యజమానుల సమస్యలను పరిష్కరించాల్సిన అసోసియేషన్‌.. ఒక విధంగా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌ పాత్ర పోషిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఎగుమతిదారుల స్వేచ్ఛని హరిస్తుండటం దేశంలో మరెక్కడా లేదు. ఎవరైనా అభ్యంతరం పెడితే తమ నాయకుడు జగన్‌ మరో 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని, ఎవరూ ఏమీ చేయలేరని గద్దిస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 06:25 AM