Share News

రామచంద్రయాదవ్‌పై తొందరపాటు చర్యలొద్దు

ABN , Publish Date - May 03 , 2024 | 04:27 AM

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్ర యాదవ్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

రామచంద్రయాదవ్‌పై తొందరపాటు చర్యలొద్దు

పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్ర యాదవ్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఆయన ఎన్నికల ప్రచారానికి అవరోధం కల్పించవద్దని పేర్కొంది. చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుం పోలీస్‌ స్టేషన్‌లో రామచంద్ర యాదవ్‌పై నమోదు చేసిన హత్యాయత్నం కేసులో న్యాయస్థానంపై ఆదేశాలిచ్చింది. విచారణను ఈ నెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ ఇదే పోలీస్‌ స్టేషన్‌లో రామచంద్ర యాదవ్‌పై నమోదు చేసిన మరో కేసులో సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధనలు పాటించాలని జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఆదేశాలిచ్చారు. అంతముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌, న్యాయవాది ఉమే్‌షచంద్ర వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా పిటిషనర్‌ను ఇబ్బందులకు గురిచేందుకు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని వారు వాదించారు.

Updated Date - May 03 , 2024 | 07:05 AM