Share News

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:12 AM

సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఆర్డీటీ సంస్థ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

తుగ్గలి, మార్చి 25: సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఆర్డీటీ సంస్థ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. సోమవారం మండల పరిధిలోని పగిడిరాయి జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో స్పెయిన్‌ దేశస్థుల చేతుల మీదుగా 70 మంది విద్యార్థులకు 70 సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ రామేశ్వరి, ఏపీఎల్‌ రెహనాబీ మాట్లాడుతూ పేదలకు ఆర్డీటీ సంస్థ ఉచిత ఇళ్లు కట్టించడంతో పాటు విద్య, వైద్యం కూడా అందిస్తుందన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు వారి చదువులు పూర్తయ్యేంత వరకు ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో చదువులు చెప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ సభ్యులు వెంకటేశ్‌, భవాని, రామాంజనేయులు, ప్రధానోపాధ

Updated Date - Mar 26 , 2024 | 12:12 AM